Latest News:

దళిత జాతికే కళంకం సునీల్‌ కుమార్‌ పులివెందుల వేషాలు కుప్పంలో చెల్లవు అఫిడవిట్‌లో చెప్పినవన్నీ నిజాలే : వైఎస్‌ షర్మిల
Nara Lokesh Yuvagalam

ఉప్పాడ కొత్తపల్లిలో దుమ్మురేపిన యువగళం పాదయాత్ర అడుగడుగునా యువనేతకు మహిళల నీరాజనాలు దళితగళం ముఖాముఖి కార్యక్రమానికి భారీగా వచ్చిన దళితులు నేడు తుని అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించనున్న యువగళం

పిఠాపురం: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 216వరోజు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో దుమ్మురేపింది.  యండపల్లి జంక్షన్ నుంచి ప్రారంభమైన యువగళం పాదయాత్రకు అడుగడగునా ప్రజలనుంచి అనూహ్య స్పందన లభించింది. దారిపొడవునా మహిళలు నీరాజనాలు పడుతూ యువనేతను స్వాగతించారు. ఉప్పాడ కొత్తపల్లిలో టిడిపి- జనసేన కార్యకర్తలు యువనేతకు ఘనస్వాగతం పలికారు. దారిపొడవునా మహిళలు, యువత, వృద్ధులు యువనేతకు సంఘీభావం తెలియజేస్తూ తాము ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు. మరో 3నెలల్లో రాబోయే టిడిపి-జనసేన ప్రభుత్వం అందరి సమస్యలు తీరుస్తుందని భరోసా ఇచ్చారు. చేనేతలు, మత్స్యకారులు, నాయీ బ్రాహ్మణులు యువనేత లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు. మధ్యాహ్నం భోజన విరామానంతరం పొన్నాడ శీలం వారిపాకలు గ్రామంలో నిర్వహించిన దళిత గళం సభకు ఉభయగోదావరి జిల్లాల నుంచి భారీఎత్తున దళితులు హాజరయ్యారు. 216వరోజు యువనేత లోకేష్ 9.6 కి.మీల పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 2974 కి.మీ.ల మేర పూర్తయింది. 217వరోజు (సోమవారం) యువగళం పాదయాత్ర తుని అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రవేశించనుంది.  

వైసిపి అహంకార ప్రభుత్వం పోయి…దళితుల ఆత్మగౌరవం గెలవాలి! వైసిపి ప్రభుత్వం రద్దుచేసిన 27 ఎస్సీ సంక్షేమ పథకాలను పునరుద్దరిస్తాం ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను దళితుల సంక్షేమం కోసమే ఖర్చుచేస్తాం వైసిపి పాలనలో దళితులపై పెరిగిన దాడులు, ప్రశ్నించే గళాలపై ఉక్కుపాదం జనసేన – టిడిపి ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని పకడ్బందీగా అమలుచేస్తాం అధికారంలోకి వచ్చాక డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసును సిబిఐకి అప్పగిస్తాం దళిత గళం ముఖాముఖి సమావేశంలో యువనేత నారా లోకేష్

పిఠాపురం: వైసిపి అహంకార ప్రభుత్వం పోయి…దళితుల ఆత్మగౌరవం గెలవాలన్నదే మా లక్ష్యం, మరో 3నెలల్లో రాబోయే టిడిపి-జనసేన ప్రభుత్వం ఆ లక్ష్యాన్ని చేరుకుంటుందని టిడిపి యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం పొన్నాడ శీలంవారిపాకలు గ్రామంలో నిర్వహించిన దళిత గళం కార్యక్రమానికి ప్రముఖ దళిత నాయకుడు మహాసేన రాజేష్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. లోకేష్ మాట్లాడుతూ… దళిత సోదరుల సమస్యలను నేరుగా తెలుసుకొని, టిడిపి-జనసేన ప్రభుత్వం వచ్చాక ఎలాంటి పథకాలు అమలుచేస్తామో చెప్పడానికే ఈ కార్యక్రమం ఏర్పాటుచేశాం. రాబోయే ఎన్నికల్లో టిడిపి-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో వైసిపి ప్రభుత్వం ఆపేసిన 27  ఎస్సీ సంక్షేమ పథకాలను పునరుద్దరిస్తాం, విదేశీశిద్య, బెస్ట్ ఎవైలబుల్, పిజి ఫీజు రీఎంబర్స్ మెంట్ కార్యక్రమాలతోపాటు ఎస్సీ విద్యార్థులకోసం డిగ్రీ గురుకుల పాఠశాలలు ఏర్పాటుచేస్తాం. ఎటువంటి మళ్లింపులు లేకుండా చట్టప్రకారం సబ్ ప్లాన్ నిధులను ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికే ఖర్చుచేస్తాం.

సామాజిక న్యాయం టిడిపితోనే సాధ్యం, నిరుపేద కుటుంబంలో పుట్టిన బాలయోగిని లోక్ సభ స్పీకర్ ను చేసింది తెలుగుదేశం, ఎపి అసెంబ్లీలో ప్రతిభాభారతికి తొలి దళిత మహిళా స్పీకర్ గా అవకాశం కల్పించింది టిడిపి.  గత టిడిపి ప్రభుత్వంలో దళితుల సంక్షేమం కోసం రూ.40వేల కోట్లు ఖర్చుచేశాం, రూ.3వేల కోట్లతో భూమి కొనుగోలు పథకాన్ని అమలుచేస్తాం. నేను పంచాయితీరాజ్ మంత్రిగా ఉన్న సమయంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమమైనా దళితుల కాలనీల నుంచే శ్రీకారం చుట్టాం. రోడ్లు, ఎల్ ఇడి లైట్లు తదితర కార్యక్రమాలను చేపట్టాం. టిడిపి-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళిత కాలనీల్లో నివసించే వారందరికీ ఎటువంటి షరతులు లేకుండా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తాం.

పాలన సౌలభ్యం కోసం రాష్ట్రానికి అమరావతి రాజధానిగా నిర్ణయించాం, అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని నిర్ణయించాం. రాజధాని ప్రాంతంలో అత్యధికంగా దళితులు ఉన్నారు, వారికోసం 5శాతం భూమిని రిజర్వ్ చేశాం, అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకోవడం వల్లే రాజధానిలో 125 అడుగుల అంబేద్కర్  విగ్రహం ఏర్పాటుచేయాలని నిర్ణయించాం. అది అంబేద్కర్ పై చంద్రబాబుకు ఉన్న గౌరవం. నేను వైసిపి జగన్ లా పరదాలు కట్టుకుని రావాల్సిన పనిలేదు, తప్పుచేయలేదు కాబట్టే దమ్ముగా ప్రజల్లో తిరుగుతున్నా. దాదాపు 3వేల కి.మీ. పాదయాత్ర చేశాను, సుదీర్ఘ పాదయాత్రలో ఒక్కరు కూడా నన్ను ప్రశ్నించలేదు, అదీ తెలుగుదేశం చిత్తశుద్ధి, ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే బాధ్యత నేను తీసుకుంటాను.

2019 ఎన్నికల్లో ఒక్క అవకాశమంటూ ముద్దులు పెట్టి జగన్ ఎపి సిఎంగా గెలిచాడు. ఆ సిఎం అయినప్పటినుంచి దళితులపై దాడులు పెరిగిపోయాయి. దళితులు గొంతెత్తి మాట్లాడే పరిస్థితి లేదు. దళిత సంఘాలను కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడనీయడం లేదు. మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ ను వేధించి చంపేశారు, చీరాలలో కోవిద్ సమయంలో మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ ను కొట్టి చంపారు, జిడి నెల్లూరు నియోజకవర్గంలో అనితారాణి బట్టలు మార్చుకుంటున్న సమయంలో వీడియో తీసి విడుదల చేశారు. గుంటూరు జిల్లాలో రమ్యను, సిఎం సొంత జిల్లాలో నాగమ్మను హత్యచేస్తే హంతకులపై ఎటువంటి చర్యలు లేవు. తాడిపత్రిలో వైసిపి వేధింపుల వల్ల సిఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నారు.

నాలుగున్నరేళ్ల వైసిపిపాలనలో 6వేలమంది దళితులపై దాడులు జరిగాయి. నందిగామలో శ్యామ్ కుమార్ పై మూత్రం పోసి అవమానించిన వారిపై చర్యలు లేవు. కాకినాడలో దళిత డ్రైవర్ సుబ్రహణ్యంను కిరాతంగా హత్యచేసి డోర్ డెలీవరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును ముఖ్యమంత్రి వెంటేసుకుని తిరుగుతున్నాడు. అది జగన్ కు దళితులపట్ల ఉన్న చిత్తశుద్ధి. టిడిపి- జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సుబ్రహ్మణ్యం హత్యకేసును సిబిఐకి అప్పగిస్తాం. దళితులకు టిడిపి-జనసేన ప్రభుత్వం అండగా నిలుస్తుంది. దళితుల రక్షణ కోసం ఉద్దేశించి ఎస్సీ, ఎస్టీ యాక్ట్ ను పకడ్బందీగా అమలుచేస్తాం.

దళిత గళం ముఖాముఖిలో ప్రశ్నలు – లోకేష్ సమాధానాలు:

ప్రశ్న, రాజేష్ : టీడీపీ దళితులకు వ్యతిరేకం, చంద్రబాబుకు దళితులు అంటే ఇష్టం ఉండదని ప్రచారం చేస్తున్నారు. ఎస్సీలు మిమ్మల్ని ఓడించినా వారికి న్యాయం జరగాలని పోరాడుతున్నారు. ఎందుకు మీకు దళితులంటే అంత అభిమానం.?

లోకేష్ : టీడీపీకి ఒక బలహీనత ఉంది. చేసిన పనిని చెప్పుకోలేం. నేను ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా దళిత కాలనీల నుండే చేపట్టా. దలితుల తరపున పోరాడినందుకు టీడీపీ నేతలపై అట్రాసిటీ కేసులు పెట్టారు. ఎమ్.ఎస్.రాజు, వంగలపూడి అనితపై అట్రాసిటీ కేసులు పెట్టారు. మాజీమంత్రి జవహర్ ను పోలీస్ స్టేషన్ లో కింద కూర్చోబెట్టి అవమానించారు. ఆనాడు నేను దళిత రైతుల కోసం పోరాడితే నన్ను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. రమ్య కుటుంబానికి న్యాయం చేయండని అడిగితే స్టేషన్ కు తీసుకెళ్లారు. దళితుల తరపున అహర్నిశలు పోరాడింది..పోరాడేది టీడీపీనే. దలితుడిపై దాడి జరిగితే స్పందించింది టీడీపీనే. నెల్లూరు జిల్లాలో ఓ దళితుడుకు చెందిన చేపల చెరువును కబ్జా చేస్తే దాన్ని మళ్లీ తిరిగి ఇప్పించాం. మా బలహీనత సరిదిద్దుకోవడానికే  ఈ దళిత గళం వినిపిస్తున్నాం.

ప్రశ్న, రాజేష్ : విదేశీ విద్య అనే గొప్ప పథకాన్ని N Chandrababu Naidu ప్రవేశపెట్టారు. దానికి ఎన్టీఆర్, చంద్రబాబు, లేదా మీ పేరో, నీ కొడుకు దేవాన్ష్ పేరో పెట్టకుండా అంబేద్కర్ పేరు ఎందుకు పెట్టారు. అమరావతిలో 125 అడుగుల ఎన్టీఆర్  విగ్రహం పెట్టొచ్చుకదా…కానీ అంబేద్కర్ విగ్రహమే ఎందుకు పెట్టాలనుకన్నారు.?

లోకేష్ : బలహీన వర్గాల పిల్లలు విదేశాల్లో చదవాలనే ఆలోచనతోనే విదేశీ విద్య పెట్టాం. ఒకరు వెళ్తే వారిద్వారా మరికొందరు వెళ్తారని విదేశీ విద్య తీసుకొచ్చాం. విద్య అందరి హక్కు అని అంబేద్కర్ రాజ్యాంగంలోనే చెప్పారు..అందుకే విదేశ విద్యకు ఆయన పెట్టాం. కానీ జగన్ వచ్చాక అంబేద్కర్ పేరు తొలగించి జగన్ విదేశీ విద్య అని పెట్టుకున్నారు. ఇది అంబేద్కర్ పట్ల చిన్నచూపు కాదా.? రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదు..రాజారెడ్డి రాజ్యాంగం అమలువుతోంది. అందుకే బలహీన వర్గాలపై దాడులు జరుగుతున్నాయి. రాజధానిపై అనేక ఆరోపణలు చేశారు. పాలనా సౌలభ్యం కోసమే రాజధాని ఒకచోట పెట్టాం. రాజధాని పెట్టింది ఎస్సీ నియోజకవర్గంలో. రాజధానిలో పేదప్రజల కోసం 5 శాతం భూమిని చంద్రబాబు కేటాయించారు. అంబేద్కర్ ను ఆదర్శంగా చంద్రబాబు తీసుకుంటారు కాబట్టే రాజధానిలో 125 అడుగుతు విగ్రహం పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.

డాక్టర్ పిల్లా చంద్రం, ఏపీ పాఠశాలల పెరెంట్స్ అసోషియేషన్ అధ్యక్షులు : దళితులను జగన్ రెడ్డి మోసం చేసినట్లు ఏ సీఎం కూడా మోసం చేయలేదు. టీడీపీ అధికారంలోకి వచ్చాక జగన్ రద్దు చేసిన పథకాలు మళ్లీ ప్రవేశపెడతారా.? 1983 ఎన్టీఆర్ గురుకులాలు తీసుకొచ్చారు..వీటిల్లో దళిత పిల్లులు బాగా చదువుకుంటున్నారు. దళితులు ఇప్పటికీ కోటా బియ్యం తింటున్నారు. సన్నబియ్యం ఇస్తామని జగన్ ఇవ్వలేదు. సన్నబియ్యం మీరు వచ్చాక అందిస్తారా.?

లోకేష్ : ఈ ప్రభుత్వం దళితులకు ఆపేసిన 27 సంక్షేమ పథకాలు తిరిగి ప్రారంభిస్తాం. విదేశీ విద్య, బెస్ట్ అవెయిల్ బుల్, సబ్ ప్లాన్ లాంటి కార్యక్రమాలు తిరిగి ప్రారంభిస్తాం. డిగ్రీ గురుకులాలను దామాషా ప్రకారం ఎక్కడ ఏర్పాటు చేయాలో చూసుకుని ఏర్పాటు చేస్తాం. ఈ ప్రభుత్వం తన్నే దున్నపోతు లాంటింది. పాలిచ్చేది టీడీపీ-జనసేన ప్రభుత్వం. ప్రజలంతా ఆలోచించాలి..ఈ ప్రభుత్వం రూ.12 లక్షల కోట్లు అప్పుల చేసింది. అందుకే విద్యుత్ బిల్లులు, బస్సు ఛార్జీలు, పెట్రోల్, డీజల్, గ్యాస్, నిత్యవసర సరుకుల ధరలు పెంచింది. ఇంటిపన్ను, చెత్తపన్నుతో ప్రజల్ని బాదుతున్నారు. చేసిన అప్పులు తీర్చడానికే ప్రజల ముక్కుపిండుతున్నారు. చంద్రబాబు హయాంలో ఒక్కసారి కూడా ఛార్జీలు పెంచలేదు. మన ప్రభుత్వం రాగానే ఆపేసిన సంక్షేమ పథకాలు తిరిగి ప్రారంభిస్తాం. 5 ఏళ్లలో ఆర్థిక వనరులు సమకూర్చుకుని మెరుగైన సంక్షేమ పథకాలు అమలు చేస్తాం.

చీలి విజయ, దళిత మహిళాశక్తి చైర్ పర్సన్ : మీరు మంత్రిగా ఉన్నప్పుడు దళిత కాలనీ నుండే అభివృద్ధి చేశామన్నారు. కానీ ఇప్పుడు మా దళిత కాలనీల్లో ఈ సీఎం చెత్త పన్ను కట్టించుకుంటూ మా దళితుల దగ్గర చెత్త వేస్తున్నారు. చెత్తపన్ను కట్టించుకూంటూ చెత్త తీసేయడం లేదు. నవంబర్ 27న జగ్గంపేట మండలం ఏర్పేడులో ఆడుకుంటున్న పిల్లలు అనారోగ్యానికి గురై జీజీహెచ్ లో వైద్యం తీసుకుంటున్నారు. మా దళిత కాలనీల్లో మీ ప్రభుత్వం వచ్చాక శుభ్రంగా ఉంచుతారా.?  

లోకేష్ : ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన చెత్తపన్ను ఎత్తేసే బాధ్యత టీడీపీ తీసుకుంటుంది. దళితులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ దళిత కాలనీలకు అందిస్తాం.

ఎం.కిరణ్ : ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని కిరణ్ కుమార్ తీసుకొచ్చారు. సబ్ ప్లాన్ నిధులు చంద్రబాబు మా కోసమే ఖర్చు చేశారు. కానీ ఈ ప్రభుత్వం సరిగా ఖర్చే చేయలేదు. అందరికీ ఇచ్చే పథకాలే మాకూ ఇస్తున్నారు. మీరు అధికారంలోకి వచ్చాక మా సబ్ ప్లాన్ నిధులు మాకే ఖర్చు చేస్తారా.?

లోకేష్ : సబ్ ప్లాన్ నిధులు ఎస్సీ, ఎస్టీలకే ఖర్చు చేస్తాం. సబ్ ప్లాన్ నిధులకు చట్టబద్ధత ఉంది..దాన్ని ఈ ప్రభుత్వం ఉల్లంఘించింది. టీడీపీ వచ్చాక పేదరికం నుండి బయటకు వెళ్లేందుకు సబ్ ప్లాన్ నిధులు ఎస్సీ, ఎస్టీలకే ఖర్చు చేస్తాం. నేను జగన్ లా పరదాలు కట్టుకుని రావాలనుకోవడం లేదు. నేను ఏనాడూ తప్పు చేయలేదు కాబట్టే గర్వంగా ప్రజల ముందుకు వచ్చా. దాదాపు 3,000 కిమీ నడిచా…మీరు మాకు  చేసిందేంటని ఎవరూ అడగలేదు. అది టీడీపీ చిత్తుశుద్ధి. మేము ఇచ్చిన హామీలను అమలు చేస్తాం.

రామ్ జీ, మాలమహానాడు, కొత్తపల్లి : పాదయాత్ర మొదలుపెట్టాక దళితుల ఇబ్బందులు తెలుసుకున్నారు. వైసీపీ అధికారంలోకి రావడానికి కారణం దళితులే. మేము ఓట్లేశాక మాకు కొత్తపథాకలు తీసుకురాకుండా ఉన్న పథకాలు తొలగించారు. రిజర్వేషన్లు అమలు చేయడంలేదు. అసైన్డ్ భూమలు స్వాధీనం చేసుకుంటున్నారు. ఎంఎస్ఎంఈ రాయితీలు ఇవ్వడం లేదు. జగన్ లా మీరు కూడా మమ్మల్ని వదిలేస్తారా.?

లోకేష్ :  2014లో టీడీపీ రాగానే రూ.200 ఉన్న పెన్షన్ ను రూ.2 వేలు చేశాం. బీమా ఇస్తామని చెప్పకపోయినా అమలు చేశాం. పసుపుకుంకుమ, అన్నదాత సుఖీభవ, అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశాం. సబ్ ప్లాన్ పక్కాగా అమలు చేశాం. దళిత కాలనీల్లో నివసించేవారికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తాం. ఓనర్ కం డ్రైవర్ గా ఉపాధి కల్పించాం. పనులు చేసుకునేందుకు జీవో కూడా ఇచ్చాం. ప్రభుత్వానికి వాహనాలు అవసరం ఉంటే కార్పొరేషన్ ద్వారా కొన్న వాహనాలకు మొదటి ప్రాధాన్యం ఇచ్చాం. ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తాం. ఆత్మగౌరవంతో పని చేయాలనే జేసీబీలు ఇచ్చి పనులు కల్పించాం. నేను పాదయాత్ర గంగాధర నెల్లూరులో చేస్తున్నప్పుడు..ఒక యువకుడు వచ్చి నాకు గతంలో 3 లారీలు ఉన్నాయి…ఇప్పుడు డ్రైవర్ గా మారాను అన్నాడు. పేదవాడు పేదవాడుగా ఉండాలనేది ఈ ప్రభుత్వం ఆలోచన. సొంత కాళ్లపై నిలబడాలనేది టీడీపీ ప్రభుత్వ విధానం. తలెత్తుకునేలా ఉండేలా చేసింది టీడీపీనే. ఆ ఆలోచనతోనే చంద్రబాబు విదేశీ విద్య తీసుకొచ్చారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి చేసి పేదరికం లేని రాష్ట్రంగా చేసే బాధ్యత టీడీపీ తీసుకుంటుంది.

మహాసేన రాజేష్  : బెస్ట్ అవెయిలబుల్ స్కూళ్ల పథకం ద్వారా దళితుల పిల్లలు మంచి స్కూళ్లో చేర్చితే మీ ప్రభుత్వమే ఫీజులు చెల్లించింది. పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ కూడా అందించారు. కానీ జగన్ వచ్చాక స్కూళ్లకు రంగులు వేసుకున్నారు తప్ప ఏమీ చేయలేదు. గురుకులాల వ్యవస్థను ఎన్టీఆర్ తీసుకొచ్చారు.

లోకేష్ : ఎన్టీఆర్ ఎయిడెడ్ స్కూళ్లో చదివారు. కానీ ఈప్రభుత్వం వాటిని కూడా చంపేసింది. కుటుంబం పేదరికం నుండి బయటకు రావాలంటే చదివించాలని చంద్రబాబు నమ్మారు. దగ్గర్లో ప్రభుత్వ పాఠశాల లేకుంటే ప్రైవేటు స్కూళ్లో చేర్చుకుంటే ఫీజులు చెల్లించాం. కానీ ఈ ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. టీడీపీ వచ్చాక బెస్ట్ అవెయిలబుల్, విదేశీ విద్య, పీజీ విద్యార్థులకు పీజు రీయింబర్స్ మెంట్ అమలు చేస్తాం. 

జనుపల్లి శ్రీనివాస్/కోడికత్తి శ్రీను కుటుంబ సభ్యులు : జనుపల్లి శ్రీనివాస్ నా తమ్ముడు. చేయని నేరానికి నా తమ్మున్ని జైల్లో అన్యాయంగా పెట్టారు. శ్రీను దాడి చేశారంటే ఎవరూ నమ్మరు. దాడి జరిగిన తర్వాత మా తరపున న్యాయస్థానంలో పోరాడతానన్న సలీమ్ అనే న్యాయవాదిని ఇబ్బంది పెట్టాలని చూశారు. నాలుగేళ్లు దాటినా దాడిపై జగన్ స్పందించడం లేదు. కలవడానికి అపాయింట్మెంట్ ఇవ్వండంటే జగన్ ఇవ్వలేదు. విశాఖకు చెందిన దళిత నేత వెంకట్రావు మాకు సాయం చేయడానికి ప్రయత్నిస్తే పోలీసులు ఆయన ఇంటిని చుట్టిముట్టారు. కూలీ పనులకు వెళ్లి వచ్చిన డబ్బులతో శ్రీను జగన్ కు ప్లెక్సీ వేయించాడు..ఆ విశ్వాసం కూడా జగన్ కు లేదు.

లోకేష్ :  ఎన్నికల ముందు శ్రీను చేతికి కోడికత్తి నేను ఇచ్చి జగన్ పై హత్యాయత్నం చేయించానని ప్రచారం చేశారు. కోడికత్తి డ్రామా, బాబాయ్ గుండెపోటు డ్రామాలు చూశాం. దాడులు చేసింది వాళ్లు..నెపం మాత్రం నాపై పెట్టారు. కేసు వీగిపోయి శ్రీను బయటకురావాలంటే నిమిషం చాలు. కానీ జగన్ కోర్టుకు వెళ్లడు..విచారణకు సహకరించడు. ఏమీలేనిదానికి ఐదేల్లుగా శ్రీను జైల్లో ఉన్నాడు. న్యాయ పోరాటానికి శ్రీను కుటుంబ సభ్యలకు అండగా ఉంటాం.

మెహేమియా : తెలంగాణలో ప్రియాంక రెడ్డి చనిపోతే రాష్ట్రంలోదిశ చట్టం తీసుకొచ్చారు. కానీ రమ్యను చంపారు. పులివెందుల్లో నాగనమ్మను చంపారు. దీనిపై చర్యలు తీసుకోలేదు. దళితులు హింసకు గుర్యారు. నేను వైసీపీ జెండాను మోశాను. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరలు కోడికత్తి శ్రీను కుటుంబ సభ్యలను బెదిరించారు. వైసీపీపై దళితులంతా యుద్ధం చేస్తారు.

లోకేష్ : నాగమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని పోరాడిన దళిత నేతలపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారు. కనీసం నాగమ్మ  కుటుంబం దగ్గరకు వెల్లనీయలేదు. పులివెందుల్లోనే అలాంటి పరిస్థితి ఉందంటే ఇక రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఉంటుంది. టీడీపీ రాగానే దళితులను ఆదుకుంటాం.  

ఖండవల్లి లక్ష్మీ, రాజానగరం: రాజానగరంలో బ్లేడ్ బ్యాచ్, డ్రగ్స్ బ్యాచ్ ఎక్కువగా ఉంది. జక్కంపూడి రాజా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎస్సీలం చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. మహిళలకు కూడా కుటుంబాలను పోషించుకుకోవడానికి ఇబ్బందులు పడుతున్నాం. మహిళలకు భరోసా ఇచ్చేందుకు ఏదోఒకటి చేయాలి.

లోకేష్ : మహిళలను ఆదుకునేందుకు చంద్రబాబు, పవనన్న కలిసి మహాశక్తి పథకం ప్రవేశపెట్టారు. 18 నుండి 59 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు నెలకు చూ.15 వందలు ఇస్తారు. తల్లికి వందనం ద్వారా ఒక్కో విద్యార్థికి రూ.15 వేలు ఇస్తాం. నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకు మహాశక్తి కార్యక్రమం ప్రవేశపెట్టారు. టీడీపీ ప్రభుత్వం రాగానే ఆడుకుంటాం.

ప్రశ్న : కొడవలి గ్రామంలో వైసీపీ నేతలు మట్టితోలుతున్నారు..అడిగితే కేసులు పెడతున్నారు. చిర్ల జగ్గిరెడ్డి అంబేద్కర్ విగ్రహం పెడతామని పెట్టలేదు..నిధులు మంజూరైనా స్పందించడం లేదు.

*యువగళంతో మళ్లీ వైసిపిలో మొదలైన ప్రకంపనలు*

*యువనేత లోకేష్ సమక్షంలో భారీగా టిడిపిలోకి చేరికలు*

*టిడిపిలో చేరిన మంగళగిరి, కాకినాడ, రంపచోడవరం నాయకులు*

పిఠాపురం:TDP యువనేత నారా లోకేష్ లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా మళ్లీ చేరికల పర్వం ఆరంభమైంది. యువగళం పాదయాత్ర ప్రారంభమైన వారంరోజులకే వైసిపిలో ప్రకంపనలు మొదలయ్యాయి. పిఠాపురం నియోజకవర్గం పొన్నాడ శీలంవారిపాకల క్యాంప్ సైట్ లో మంగళగిరి, కాకినాడ, రంపచోడవరం నియోజకర్గాలకు చెందిన 500కు పైగా కుటుంబాలు వైసిపి నుంచి టిడిపిలో చేరారు.  మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పట్టణ పార్టీ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు, నియోజకవర్గ పరిశీలకులు ఎం.వీ.వీ.సత్యనారాయణ నేతృత్వంలో వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. వీరికి పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ జెండాను ఎగరేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. 2024లో టీడీపీ-జనసేన ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చేందుకు అందరూ కలసి పనిచేయాలని కోరారు. పార్టీలో చేరిన వైసీపీ ముఖ్య నాయకుల్లో కేళి వెంకటేశ్వరరావు, సిద్దిల కిరణ్, ఇసుకపల్లి రవి, సిద్దిల నోవాహు, అచ్చియ్య, గొల్లపూడి రాజారత్నం, గుంజు సుబ్బారావు, కాకాణి శివయ్య, కాకాణి సునీల్, బుజ్జిబాబు, సూర్యకిరణ్, దొర్ల వసంత్, కేళి కరుణాకర్, షేక్ కరీముల్లా, సిద్దుల ప్రేమ్ కుమార్, గుడిమె జాన్ బాబు, గుడిమె సందీప్, ముట్లూరి అజయ్ కుమార్, పృథ్వి, మాగం కమల్, కరగాని కిరణ్, కరగాని సురేష్, కాకాని రమేష్, కేశనపల్లి సుగుణరావు, తదితరులు ఉన్నారు. పార్టీలో చేరిన వారిని లోకేష్ అభినందించి కృతజ్ఞతలు తెలిపారు.

కాకినాడ నియోజకవర్గం నుంచి 300 కుటుంబాలు చేరిక

కాకినాడ సిటీ నియోజకవర్గానికి చెందిన కీలకమైన వైసీపీ నాయకులు 300మంది టీడీపీలో చేరారు. కాకినాడ సిటీకి చెందిన సానా సతీష్ నేతృత్వంలో వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు. వీరికి టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన ముఖ్య నాయకుల్లో పెనుపోతు తాతారావు, కామాడి సీతదశరథ, నాటి ధర్మారావు, చెక్కా లక్ష్మణ్, పినపోతు కనకరాజు, వాడ్రేవు సుబ్రహ్మణ్యం, మల్లాడి తాతారావు, కామాడి మాతరాజు, మచ్చా లక్ష్మి, సంగాని బ్రహ్మయ్య, పెమ్మడి సూర్యావతి, సందక వరలక్ష్మి, ఓలేటి జయలక్ష్మి, రాయుడు దుర్గ, జి సత్యారత్నం, బందన రాజు, కాటాడి రామకృష్ణ, ఎస్ దుర్గబాబు, పి హనుమాన్, ఎస్.ఎన్.రాజు, పి రాజేష్, జి పెదరాజు, పాలెపు సూరిబాబు, కె శ్రీను, శాంతి, బి.నాగరాజు, జోగినాయుడు, ప్రకాష్, శ్రీరామరాజు, వి వెంకటరమణ, తదితరులు ఉన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరినీ లోకేష్ ప్రత్యేకంగా అభినందించారు.

రంపచోడవరం నుంచి 200 కుటుంబాల చేరిక

రంపచోడవరం నియోజకవర్గానికి చెందిన ముఖ్యమైన వైసీపీ నాయకులు, వైసిపి కార్యకర్తలు టీడీపీలో చేరారు. అరకు పార్లమెంటు ఉపాధ్యక్షులు సంగం శ్రీకాంత్ ఆధ్వర్యంలో 200మంది రంపచోడవరం నియోజకవర్గానికి చెందిన సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీలు, ఆదివాసీ జేఏసీ నాయకులు టీడీపీలో చేరారు. వీరిని నారా లోకేష్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జగన్ పాలనతో విసిగిపోయిన వైసీపీ కీలక నాయకులే టీడీపీలోకి రావడం శుభపరిణామం అన్నారు. పార్టీలో చేరిన ముఖ్య నాయకుల్లో గణజాల తాతారావు, కోసూరి బుజ్జి చిన్నాలమ్మ, తమదాల సత్యనారాయణ, చొలుమర్తి నాగేశ్వరరావు, బొడ్డు రాంబాబు, వసంశెట్టి గంగాధర్, తమదాల సరస్వతి, కోపూరి రత్నం, పురంశెట్టి సత్యనారాయణమూర్తి, గణజాల మల్లిఖార్జున, తోట వీరబాబు, కంటపురెడ్డి వీరబాబు, మాడెం చిట్టిబాబు, విల్లా సత్యరాజు, బురుజు ప్రతాప్, గజ్జి రమణ, సున్నం వెంకటరమణ, తెల్లం నవీన్ బాబు, సొంది రామయ్య, పిడియం సావిత్రి, సరియం శ్రీను, పునేం చంద్రమ్మ తదితరులు ఉన్నారు.

నారా లోకేష్ ను కలిసిన నాయీ బ్రాహ్మణ ప్రతినిధులు

పిఠాపురం కొత్తపల్లిలో విజయదుర్గ నాయీబ్రహ్మణ సేవాసంఘం  ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రo ఇచ్చారు.  నాయీ బ్రాహ్మణులకు 50ఏళ్లకు పెన్షన్ సౌకర్యం కల్పించాలి. నాయీ బ్రాహ్మణులకు హెల్త్ కార్డులు ఇవ్వాలి. నాయీ బ్రాహ్మణులకు షాపులు కట్టించి, 200యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇవ్వాలి. నాయీ బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ నిర్మించాలి.

లోకేష్ స్పందిస్తూ….

టీడీపీ పాలనలో నాయీ బ్రాహ్మణులకు ఆదరణ పథకం ద్వారా పనిముట్లు అందించాం. బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీలోన్లు అందించి షాపులు పెట్టుకునే అవకాశం కల్పించాం. కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి నిధులిచ్చి పనులు ప్రారంభించాం. వైసీపీ ప్రభుత్వం వచ్చాక పనులన్నీ నిలిపేసింది. మేం అధికారంలోకి వచ్చాక నాయీబ్రాహ్మణులను ఆదుకుంటాం. ఆదరణ పథకం ద్వారా పనిముట్లు అందిస్తాం. హెల్త్ కార్డులు మంజూరు చేసి వైద్యం అందిస్తాం. షాపులు పెట్టుకునేందుకు అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన ఉప్పాడ చేనేతలు

ఉప్పాడ చేనేత కార్మికులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. టీడీపీ పాలనలో చేనేతలను అనేక విధాలుగా అభివృద్ధి చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక చేనేతలకు పని కరువైంది, ఆర్థికంగా చితికిపోయాయం. ఇతర పనులకు వెళ్లి కుటుంబాలను పోషించుకుంటున్నాం. మీరు అధికారంలోకి వచ్చాక చేనేతలకు నూలు, జరీలను సబ్సిడీపై అందించాలి. చేనేత వస్త్రాలపై జీఎస్టీని రద్దు చేయాలి. అర్హతలను బట్టి చేనేతల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి.  చేనేత కార్మికులకు కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలి. చేనేత కుటుంబాల్లో ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయలు ఆర్థికసాయం చేయాలి.

లోకేష్ స్పందిస్తూ…

రాష్ట్రంలో వైసిపి అసమర్థ పాలన కారణంగా చేనేతరంగం సంక్షోభంలో కూరుకుపోయింది. వైసిపి అధికారంలోకి వచ్చాక 60మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడగా, వారికి పరిహారం అందించకపోగా కనీసం పరామర్శించలేదు. టిడిపి హయాంలో చేనేత కార్మికులకు రూ.110కోట్ల రుణమాఫీ చేసి ఆదుకున్నాం. చేనేత కార్మికులకు గుర్తింపుకార్డులు అందజేసి సంక్షేమపథకాలు అందించేలా చర్యలు తీసుకుంటాం. చేనేత వస్త్రాలపై జిఎస్టీ రద్దుచేస్తాం. మగ్గం ఉన్న ప్రతి చేనేత కార్మికుడికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తాం. చేనేత కార్మికులకు చంద్రన్న బీమా, ఆరోగ్య బీమా పథకాలను వర్తింపజేస్తాం. చేనేత కార్మికుల పిల్లలకు స్కాలర్ షిప్ లు అందజేసేలా చర్యలు తీసుకుంటాం. ఇళ్లు లేని చేనేత కార్మికులు ఇళ్లు నిర్మించడంతో పాటు కామన్ వర్క్ షెడ్లు నిర్మిస్తాం. పెళ్లికానుక పథకం ద్వారా చేనేతల పిల్లలకు ఆర్థికసాయం అందిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన మత్స్యకారులు

పిఠాపురం నియోజకవర్గం అమీనాబాదలో ఉప్పాడ మత్స్యకారులు యువనేత లోకేష్ ను కలిశారు. ఉప్పాడ సముద్ర తీరంలో గట్టు నిర్మించాలి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక మాకు చంద్రన్న బీమా పథకాన్ని రద్దు చేసింది. టీడీపీ అధికారంలోకి వచ్చాక చంద్రన్న బీమా పథకాన్ని పునరుద్ధరించాలి. ఫిషింగ్ హార్బర్ వద్ద పడవలు విరిగి మత్స్యకారులు చనిపోతున్నారు. మీరు అధికారంలోకి వచ్చాక ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి.

లోకేష్ స్పందిస్తూ….

మత్స్యకారులను అన్నివిధాలా ఆదుకున్ననది తెలుగుదేశం ప్రభుత్వమే. వైసీపీ అధికారంలోకి వచ్చాక మత్స్యకారులకు తీరని అన్యాయం చేసింది. వేట నిషేధ కాలంలో ఇచ్చే పరిహారం కూడా పూర్తిస్థాయిలో ఇవ్వడం లేదు. మత్స్యకారులకు పనిముట్లు, బోట్లను సబ్సిడీపై టీడీపీ ఇస్తే, వైసీపీ రద్దు చేసింది. సముద్రంలో ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు రూ.5లక్షలు ఇచ్చి ఆదుకున్నాం. వైసీపీ పాలనలో కనీసం చనిపోయిన కుటుంబాలను పరామర్శించే దిక్కు లేదు. మేం అధికారంలోకి వచ్చాక ఉప్పాడ మత్స్యకారులను ఆదుకుంటాం. ఉప్పాడ సముద్రతీరంలో అవసరమైన గట్టు నిర్మాణాన్ని చేపడతాం. చంద్రన్న బీమా ద్వారా మత్స్యకారుల కుటుంబాలను ఆదుకుంటాం. బోట్ల ప్రమాదాలు జరగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటాం.

Also read this blog: Nara Lokesh Meets Tomorrow’s Leaders at Yuvagalam

#LokeshPadaYatra #Padayatra #YuvaGalamLokesh #YuvaGalam #NaraLokeshPadaYatra #NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *