*పిఠాపురంలో జనసంద్రంగా మారిన యువగళం పాదయాత్ర*

*పట్టణ వీధుల్లో టిడిపి-జనసేన కార్యకర్తల కోలాహలం*

*నేడు శీలంవారిపాకలు సెంటర్ లో దళిత గళం పేరుతో

పిఠాపురం: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర పిఠాపురం పట్టణంలో జనసంద్రాన్ని తలపించింది. కాకినాడ రూరల్ తిమ్మాపురం నుంచి బయలుదేరిన యువగళం పాదయాత్ర పెద్దాపురం నియోజకవర్గం పవర మీదుగా చిత్రాడ వద్ద పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. చిత్రాడలో పిఠాపురం ఇంఛార్జి ఎన్వీవీఎస్ వర్మ ఆధ్వర్యంలో యువనేత లోకేష్‍కు అపూర్వస్వాగతం లభించింది. చిత్రాడలో ప్రధాన ప్రధాన రహదారి జనంతో కిక్కిరిసిపోయింది. లోకేష్ రాక సందర్భంగా పూలవర్షంతో ముంచెత్తారు.   డప్పు చప్పుళ్లు, డిజె సౌండ్స్, బాణా సంచా మోతలతో కార్యకర్తలు కేరింతలు కొట్టారు. యువగళం జెండాలతో సందడి జనసేన కార్యకర్తలు, అభిమానులు సందడి చేశారు. దారిపొడువునా హారతులతో మహిళలు నీరాజనాలు పట్టారు.  యువనేతతో ఫోటోలు దిగేందుకు యువతీయువకులు పోటీపడ్డారు. భారీ గజమాలలతో యువనేతకు పార్టీనేతలు, కార్యకర్తల సత్కరింఛారు. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో పాదగయ క్యాంప్ సైట్ వద్ద సెల్ఫీ విత్ నారా లోకేష్ సుమారుగా వెయ్యి మందితో ఫోటోలు దిగారు. అందరినీ ఆప్యాయంగా పలకరించి ఫోటోలు దిగడం పట్ల కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. పాదగయ క్యాంప్ సైట్ నుండి భోజన విరామానంతరం ప్రారంభమైన పాదయాత్రకు పిఠాపురంలో జనం పోటెత్తారు. పిఠాపురంలో లోకేష్ కి జనసేన ఇంఛార్జ్ ఉదయ్ శ్రీనివాస్ నేతృత్వంలో జనసైనికులు ఘనస్వాగతం పలికారు. పిఠాపురంలో రోడ్డుకి ఇరువైపులా జనం బారులు తీరారు. భవనాలు ఎక్కి లోకేష్ కి జనం అభివాదం చేశారు. యువత, మహిళలు, వృద్ధులను కలుస్తూ వారి సమస్యలను తెలుసుకున్నారు. 215వరోజు యువనేత లోకేష్ 19.8 కి.మీ.ల పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 2964.4 కి.మీ.లు పూర్తయింది. యువగళం పాదయాత్రలో భాగంగా ఆదివారం సాయంత్రం పొన్నాడలో దళితగళం పేరుతో నిర్వహించే సభకు యువనేత లోకేష్ హాజరవుతారు.

*పెత్తందారు వైసీపీకు పేదోడి ఆకలి తెలుస్తుందా?!*

పేదల ఆకలి తీర్చేందుకు పిఠాపురం పాతబస్టాండు సెంటర్ లో గత టిడిపి ప్రభుత్వం ఏర్పాటుచేసిన అన్నా క్యాంటీన్ ఇది. అధికారాన్ని అడ్డుపెట్టుకొని లక్షల కోట్లు పోగేసిన వైసీపీ… పేదలు కడుపునిండా అన్నం తినడం ఓర్వలేక అన్నాక్యాంటీన్లను రద్దుచేశాడు. ఎన్నికల సమయంలో ఓట్లకోసం ముద్దులు పెట్టి బుగ్గలు నిమరడం, అవసరం తీరిపోయాక పిడిగుద్దులతో హింసించడం వైసీపీ నైజం. పాపపు సొమ్ముతో ఊరికో ప్యాలెస్ కట్టి లీటర్ వెయ్యి రూపాయల నీళ్లు తాగే పెత్తందారుకు పేదోడి ఆకలి కేకలు వినిపిస్తాయా?!

నారా లోకేష్ ను కలిసిన పిఠాపురం న్యాయవాదులు

వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం-2023ను రద్దు చేయాలి. ఈ చట్టం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంది. సివిల్ కోర్టులకు విచారణ పరిధి లేకుండా చేశారు. ప్రభుత్వ పరిధిలో పనిచేసే ల్యాండ్ టైటిలింగ్ అధికారులపై రాజకీయ జోక్యం ఉండే ఆస్కారం ఉంది. సివిల్ కేసులు వేగవంతంగా పరిష్కరించాలనుకుంటే కోర్టులు, సిబ్బంది సంఖ్యను పెంచాలి. న్యాయవాదులకు రక్షణ చట్టం తీసుకురావాలి. వైసీపీ ప్రభుత్వం న్యాయవాదుల సంక్షేమానికి ఇస్తానన్న రూ.100కోట్లలో రూ.75కోట్లు నేటికీ రాలేదు. కోర్టుల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి, నిర్మాణ దశలో ఉన్న కోర్టు భవనాలు పూర్తిచేయాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి కేసులు వేగంగా పరిష్కరించాలి. రూ.20 అడ్వకేట్ వెల్ఫేర్ స్టాంపును రద్దు చేసి, రూ.100 వెల్ఫేర్ స్టాంపును అమలు చేయాలి. న్యాయవాదుల కుటుంబాలకు ఆరోగ్య బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించాలి. 41ఏ సీఆర్పీసీ నోటీసుల దుర్వినియోగం అవుతున్న నేపథ్యంలో కొత్త మార్గదర్శకాలు రూపొందించాలి.

లోకేష్ స్పందిస్తూ…

వైసీపీ పాలనలో న్యాయానికి సంకెళ్లు వేసే దుర్మార్గపు సంస్కృతిని తెచ్చాడు.

న్యాయం కోసం పోరాడే న్యాయవాదులపై దాడులు, అక్రమ కేసులతో వేధింపులకు దిగుతున్నారు. సామాన్యుడికి న్యాయాన్ని దూరం చేసేలా నల్ల చట్టాలు తెస్తున్నారు. న్యాయమూర్తులను సైతం వైసీపీ సోషల్ మీడియా గ్రూపుల్లో  కించపరుస్తున్నారు. మేం అధికారంలోకి వచ్చాక న్యాయవాదులకు రక్షణ చట్టం తెస్తాం. ల్యాండ్ లైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తాం. న్యాయవాదుల సంక్షేమ నిధిని పెంచుతాం. నిలిచిపోయిన కోర్టు భవనాల పనులు పూర్తిచేస్తాం. సత్వర న్యాయం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను అమల్లోకి తెస్తాం.

లోకేష్ ను కలిసిన ప్రైవేటు టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు

పిఠాపురం కుక్కుటేశ్వరస్వామి ఆలయం సెంటర్ లో ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ అసోసేయేషన్ ప్రతినిధులు యువనేత లోకేషష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు టీచర్స్, లెక్చరర్లు 4లక్షల మంది ఉన్నాము. అరకొర జీతాలతో జీవనం సాగిస్తున్నాం. మాకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు జారీ చేసి ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలి. మాకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు వర్తింపజేయాలి. ప్రతి ప్రైవేటు టీచర్ కు రూ.12వేలు కనీస జీతం ఇప్పించాలి. ప్రైవేటు టీచర్లకు ప్రత్యే కార్పొరేషన్ పెట్టి, నిధి ఏర్పాటు చేసి మరణించిన వారి కుటుంబాలకు బీమా కల్పించాలి. మా సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక మ్యానిఫెస్టోలో పెట్టే అంశాలను అమలు చేయాలి.

నారా లోకేష్ స్పందిస్తూ…

వైసీపీ పాలనలో విద్యారంగం పూర్తిగా భ్రష్టుపట్టించారు. రకరకాల నిబంధనలు విధించి ప్రైవేటు విద్యాసంస్థలను జే ట్యాక్స్ కోసం వైసీపీ వేధించి వసూళ్లు చేస్తున్నాడు. కరోనా సమయంలో ప్రైవేట్ టీచర్లను ప్రభుత్వం ఆదుకోకపోవడంతో కూలీపనులకు వెళ్లిన ఘటనలు కూడా చూశాం. TDP అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రైవేటీ టీచర్లు, లెక్చరర్లకు ప్రభుత్వ పథకాలు వర్తించేలా చర్యలు తీసుకుంటాం. ప్రైవేట్ టీచర్లకు ఈఎస్ఐ, పీఎఫ్, బీమా వంటి సౌకర్యాలు కల్పనకు చర్యలు తీసుకుంటాం.

లోకేష్ ను కలిసిన పిఠాపురం బిసీ సామాజికవర్గీయులు

పిఠాపురం హాస్పటల్ వద్ద బిసి సామాజికవర్గీయులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. టీడీపీ పాలనలో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి పిఠాపురం కౌన్సిల్ రూ.70లక్షలు మంజూరుకు తీర్మానం చేసింది. వర్క్ ఆర్డర్ వచ్చేనాటికి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. వైసిపి అధికారంలోకి వచ్చిన వైసీపీ కమ్యూనిటీహాల్ నిర్మాణాన్ని రద్దు చేసింది. వైసీపీ ఎమ్మెల్యే దొరబాబు తన పీఏతో కలిసి కమ్యూనిటీ హాల్ కు కేటాయించిన స్థలాన్ని రూ.2కోట్లకు అమ్మేందుకు ప్రయత్నం చేశారు. దీనిపై మేం ఆందోళన చేయగా ఎమ్మెల్యే, తన పీఏ వెనక్కి తగ్గారు. నియోజకవర్గం వ్యాప్తంగా 1.10లక్షల మంది బీసీలు ఉన్నారు. మీరు అధికారంలోకి వచ్చాక కమ్యూనిటీ హాల్ నిర్మించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ…

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక బిసిలను అణచివేయడమే పనిగా పెట్టుకున్నారు. బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ 10శాతం తగ్గించడంతో 16,500 మంది బిసిలు పదవులకు దూరమయ్యారు. బిసిల కోసం ఖర్చుచేయాలని రూ.75,760 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించి అన్యాయం చేశారు. టిడిపి అధికారంలోకి వచ్చాక పిఠాపురం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు కేటాయించి పూర్తిచేస్తాం. బిసిలకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని అమల్లోకి తేవడం ద్వారా బిసిలపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.

నారా లోకేష్ ను కలిసిన పిఠాపురం దళితులు

పిఠాపురం అంబేద్కర్ సెంటర్ లో ఎస్సీ సామాజికవర్గీయులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. వైసీపీ రద్దు చేసిన 27 దళిత సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలి. విదేశీవిద్యకు జగన్ పేరు తీసేసి అంబేద్కర్ పేరు పెట్టాలి. దళితులపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టాలి,నిందితులను కఠినంగా శిక్షించాలి. దళితుల వద్ద లాక్కున్న అసైన్డ్ భూములను తిరిగి ఇప్పించాలి. విద్యాప్రోత్సాహకాలను గతంలో ఇచ్చిన విధంగా ఇవ్వాలి. ఎస్సీ బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీచేయాలి.

నారా లోకేష్ ను కలిసిన మోటార్ మెకానిక్ వర్కర్లు

పిఠాపురం పాతబస్టాండులో మోటారు మెకానిక్స్ సంక్షేమ సంఘం ప్రతినిధులు  యువనేత లోకష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా 20లక్షల మంది మెకానిక్ లు ఉన్నారు. మీరు అధికారంలోకి వచ్చాక మాకు పనిముట్ల ఇచ్చి ఉపాధి కల్పించాలి. మెకానిక్ ల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి. మెకానిక్ లకు రాష్ట్రంలో ఎక్కడా సంఘం భవనాలు లేవు..కట్టించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ…

వైసీపీ విధ్వంసక పాలనలో చేతవృత్తులన్నీ తీవ్రంగా దెబ్బతిన్నాయి. టీడీపీ హయాంలో ఆదరణ పథకం ద్వారా పనిముట్లు అందించి ఆదుకున్నాం. మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే మోటార్ మెకానిక్ లకు స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ ఇచ్చి, టూల్ కిట్స్ అందజేస్తాం. మోటారు మెకానిక్ లు షెడ్లు ఏర్పాటు చేసుకునేందుకు తక్కువ వడ్డీతో సబ్సిడీ రుణాలు అందజేస్తాం. ఇళ్లు లేని మెకానిక్ లకు ఇంటి స్థలంతోపాటు ఇల్లు నిర్మించి ఇస్తాం. బీమా సౌకర్యం కల్పిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన ముస్లిం సామాజికవర్గ ప్రతినిధులు

పిఠాపురం ఉప్పాడ సెంటర్ లో ముస్లిం సామాజికవర్గీయులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. టీడీపి హయాంలో పిఠాపురంలో 4 మసీదుల నిర్మాణానికి అనుమతులిచ్చారు. అప్పట్లో ఒక్కో మసీదుకు రూ.10లక్షల నిధులు మంజూరు చేశారు. షాధీఖానా కోసం 21సెంట్ల స్థలం, రూ.50లక్షలు నిధులు మంజూరు చేశారు. బరియల్ గ్రౌండ్ కోసం రూ.20లక్షలు మంజూరు చేశారు. ఈ నిధులను వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రద్దుచేసింది.  గత ప్రభుత్వం ఎటువంటి నిబంధనలు లేకుండా అమలుచేసి దుల్హన్ పథకాన్ని అడ్డగోలు నిబంధనలు విధించి పేదలకు అందకుండా చేశారు. టీడీపీ పాలనలో మా ప్రాంతంలో  ముస్లింల స్వయం ఉపాధికి 15మందికి లక్ష చొప్పున లోన్లు ఇచ్చారు. వైసీపీ పాలనలో ఒక్క రూపాయి లోన్ ఇవ్వలేదు. మీరు అధికారంలోకి వచ్చాక మా సమస్యలను పరిష్కరించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ…

వైసీపీ అధికారంలోకి వచ్చాక ముస్లింల సంక్షేమాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేశారు. ముస్లిం మైనారిటీలకు చెందాల్సిన రూ.5,400 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించారు. పేద ముస్లింలకు గత ప్రభుత్వం అమలుచేసిన దుల్హాన్ పథకాన్ని నిబంధనలతో నీరుగార్చారు. అబ్ధుల్ సలాం, ఇబ్రహీం, హజీరా, మిస్బా వంటి అనేక మందిని వేధించి పొట్టనబెట్టుకున్నారు. మైనారిటీలకు చెందిన వేలకోట్ల వక్ఫ్ బోర్డు ఆస్తులను వైసిపి నేతలు కొట్టేశారు. టిడిపి అధికారంలోకి వచ్చాక గతంలో అమలు చేసిన పథకాలను మైనారిటీలకు అందిస్తాం. ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటుద్వారా పేద ముస్లింల స్వయం ఉపాధికి చర్యలు తీసుకుంటాం. దుల్హాన్, విదేశీవిద్య తదితర పథకాలను పునఃప్రారంభిస్తాం.

యువనేత లోకేష్ ను కలిసిన పిఠాపురం ప్రజలు

పిఠాపురం లారీ యూనియన్ వద్ద జగ్గయ్య చెరువు కాలనీ, రథాలపేట వాసులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. పిఠాపురం జగ్గయ్యచెరువు పాత, కొత్త కాలనీల్లో డ్రైనేజీలు లేవు. మా ప్రాంతంలో 10వేల మంది జనాభా ఉన్నారు. మురికినీటి ప్రభావంతో దోమలవల్ల నిత్యం అనారోగ్యానికి గురవుతున్నాం. మా ప్రాంతానికి హైస్కూల్ లేదు. రథాల చెరువులో నాలుగున్నరేళ్లుగా దళితులకు సబ్సిడీ లోన్లు ఇవ్వడం లేదు. దళితులకు వాహనమిత్ర లోన్లు ఇవ్వడం లేదు. కులాంతర వివాహాలకు ప్రోత్సాహకాలు లేవు. దళిత విద్యార్థులకు ఉపకారవేతనాలు నిలిపేశారు. దళితులపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయి. మీరు అధికారంలోకి వచ్చాక మా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోండి.

నారా లోకేష్ స్పందిస్తూ…

వైసీపీ పాలనలో స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. వైసిపి ప్రభుత్వానికి పన్నుల వసూళ్లపై ఉన్న శ్రద్ధ ప్రజలకు సౌకర్యాల కల్పనపై లేదు. మున్సిపాలిటీల్లో కనీసం బ్లీచింగ్ చల్లడానికి కూడా నిధులు లేవు. మేం అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థలకు బలోపేత చేసి, మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. జగ్గయ్యపేట చెరువులో డ్రైనేజీలు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తాం. దళితులకు గత ప్రభుత్వం అమలుచేసిన 27 సంక్షేమ పథకాలను పునరుద్దరిస్తాం. దళితులపై దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించి, రక్షణ కల్పిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన చిత్రాడ గ్రామ ప్రజలు

పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామప్రజలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.  మా గ్రామంలో రెండేళ్ల క్రితం సెంటు పట్టా భూములు ఇచ్చారు. గ్రామానికి దూరంగా పక్కనున్న నరసింగపురం గ్రామానికి దగ్గర్లో ఇచ్చారు. గ్రామానికి దూరంగా ఉండడంతో మేం ఎవరూ అక్కడికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది.  ఒక్కరు కూడా ప్రభుత్వం ఇచ్చిన సెంటు పట్టాల్లో ఇళ్లు కట్టుకోలేదు. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామంలో అందుబాటులో స్థలాలు ఇప్పించాలి.

లోకేష్ స్పందిస్తూ…

వైసీపీ సెంటు పట్టాల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా రూ.7వేల కోట్లు దోచుకున్నారు. వైసీపీ నేతల అవినీతి సంపాదన కోసం సామాన్యులకు నివాసానికి పనికిరాని స్థలాలు ఇచ్చారు. సామాన్యుడి నుండి తక్కువ ధరకు స్థలాలు కొని అధిక ధరలకు భూములు అమ్ముకుని వైసీపీ నేతలు జేబులు నింపుకున్నారు. మేం అధికారంలోకి వచ్చాక వైసీపీ భూ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపిస్తాం. పేదలకు నివాసయోగ్యమైన స్థలాలు ఇచ్చి, ఇళ్లు నిర్మిస్తాం.

Also, read this blog: Nara Lokesh Meets Tomorrow’s Leaders at Yuvagalam

Tagged: #LokeshPadaYatra #Padayatra #YuvaGalamLokesh #YuvaGalam #NaraLokeshPadaYatra #NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *