యనమల ఇలాకాలో దుమ్మురేపిన యువగళం అడుగడుగునా యువనేతకు ఆత్మీయ స్వాగతం కష్టాలు వింటూ… కన్నీళ్లు తుడుస్తూ అడుగుముందుకు
తుని: టిడిపి యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర సీనియర్ నేత యనమల రామకష్ణుడు ఇలాకా తుని నియోజకవర్గంలో దుమ్ములేపింది. 217వరోజు యువగళం పాదయాత్ర పిఠాపురం నియోజకవర్గం శీలంవారిపాకలు విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. అడుగడుగునా యువనేతకు జనం బ్రహ్మరథం పట్టారు. తొండంగి మండలం కడారిపేట వద్ద పాదయాత్ర తుని నియోజకవర్గంలోకి ప్రవేశించింది. పెరుమాళ్లపురం వద్ద టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, తుని ఇన్ చార్జి యనమల దివ్య నేతృత్వంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు యువనేతకు ఘనస్వాగతం పలికారు. మహిళలు హారతులతో నీరాజనాలు పడుతూ యువనేతను స్వాగతించారు. భారీ గజమాలలు, డిజెలు స్వాగతం పలికిన కార్యకర్తలు సైకోపోవాలి – సైకిల్ రావాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు. జిఎంఆర్ హాస్పటల్ వద్ద మత్స్యకారులతో ముఖాముఖి సమావేశమైన లోకేష్ వారి సమస్యలు తెలుసుకున్నారు. దారిపొడవునా పాదయాత్రకు సంఘీభావం తెలిపిన వివిధ వర్గాల ప్రజలు తాము ఎదుర్కొంటున్న కష్టాలను యువనేత ఎదుట ఏకరువు పెట్టారు. మరో 3నెలల్లో చంద్రబాబు నేతృత్వంలో రాబోయే ప్రజాప్రభుత్వం అందరి కష్టాలు తీరుస్తుందని భరోసా ఇచ్చారు. 217వరోజు యువనేత లోకేష్ 16.4 కి.మీ.ల పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 2990.4 కి.మీ.లు పూర్తయింది. యువగళం పాదయాత్రలో ఆదివారం మధ్యాహ్నం శృంగవృక్షంలో కాకినాడ సెజ్ భూనిర్వాసితులతో యువనేత లోకేష్ ముఖాముఖి సమావేశం కానున్నారు.
చేతగాని సిఎం అవసరమా ?
ఇది తుని నియోజకవర్గం, పెరుమాళ్లపురంలో ఇప్పటి సర్కారు ఫిష్ ఆంధ్ర పేరుతో ఏర్పాటుచేసిన చేపల దుకాణం. పరిశ్రమలు తెచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వడం చేతకాని ప్రభుత్వం … మత్స్యకారుల పొట్టగొట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 90 శాతం ఫిష్ ఆంధ్రా అవుట్ లెట్లు ఫినిష్ అయ్యాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే 2.30లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తామని చెప్పి అయిదేళ్ల పుణ్యకాలమూ పూర్తైపోయింది. నమ్మకద్రోహం, అబద్ధాలు, వంచనకు ప్యాంటు, షర్టు వేస్తే ఈ ప్రభుత్వపు మంతుర్లు… ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని ఇటువంటి చేతగాని, చేవలేని దద్దమ్మ ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా…
కాస్త రోడ్ల గురించి కూడా పట్టించుకోండి మంత్రి గారూ…!
ఇవి తుని నియోజకవర్గం పెరుమాళ్లపురంలో పాలన ప్రభుత్వపు గుంతల పథకంలో ఏర్పాటైన భారీగోతులు. పైగా ఇది రాష్ట్ర రోడ్లు,భవనాల శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం. ఆర్ అండ్ బి మంత్రిగ ప్రాతినిధ్యం వహిస్తున్న చోటే రోడ్ల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఇక రాష్ట్రం మొత్తమ్మీద ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టర్లకు వివిధ విభాగాల ద్వారా రూ.2లక్షల కోట్లకు పైగా బకాయిలు పెట్టడంతో ఎన్నిసార్లు టెండర్లు పిలిచినా దివాలాకోరు మొఖం చూసి రోడ్లు వేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. సందు దొరికినప్పుడల్లా ప్రతిపక్షాలపై నోరేసుకుని దాడిచేయడం కాదు… కాస్త రోడ్లపై కూడా దృష్టిసారించండి మంత్రి గారూ…!!
అధికారంలోకి వచ్చిన వెంటనే జిఓ 217 రద్దుచేస్తాం! ఉల్లిగడ్డలు, బంగాళాదుంపలకు తేడా తెలియని సిఎం నిబంధనాలను తొలగించి మత్స్యకారులను ఆదుకుంటాం మత్స్యకారులతో ముఖాముఖిలో యువనేత లోకేష్
తుని: పాలనలో వున్న ప్రభుత్వం మత్స్యకారుల పొట్ట కొడుతూ తెచ్చిన జిఓ 217ను, TDP ప్రభుత్వం వచ్చిన వెంటనే రద్దు చేసి, చెరువులు తిరిగి మత్స్యకారులకు అందిస్తామని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. తుని నియోజకవర్గం పెరుమాళ్లపురం జిఎంఆర్ హాస్పటల్ సమీపంలో మధ్యాహ్న విడిది కేంద్రం వద్ద మత్స్యకారులతో యువనేత లోకేష్ ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… ఉల్లి గడ్డ కి , బంగాళాదుంపలకి తేడా తెలియని వ్యక్తి మనకి ముఖ్యమంత్రి అయ్యాడు. అతను ఎక్కడ చదివాడో తెలియదు. టెన్త్ పేపర్లు కొట్టేసి పాసయ్యాడు. ఆయన మాటలు విన్నాక పాదయాత్ర చేసింది తనేనా లేక డూప్ నా అనే అనుమానం కలుగుతోంది. తుఫాను వలన మత్స్యకారులు, రైతులు నష్టపోతే పరామర్శించే మనస్సు ఈ పరాధలా CM కి రాలేదు. మత్స్యకారులు కష్టాన్ని నమ్ముకొని బతుకుతారు. సాయం చేస్తే జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. గంగమ్మనే నమ్ముకొని మత్స్యకారులు జీవిస్తారు. బాబు హయాంలో ఏపి మత్స్యకారప్రదేశ్…. ఇతని హయాంలో ఫినిష్ ఆంధ్ర… బోటు, వలలు, డీజిల్ సబ్సిడీ, భీమా, 50 ఏళ్లకే పెన్షన్, వేట నిషేదం సమయంలో సహాయం, జిపిఎస్, మోపెడ్, ఐస్ బాక్సులు, వ్యాన్లు అన్ని మత్స్యకారులకు సబ్సిడీలో అందించింది టిడిపి. టిడిపి హయాంలో మత్స్యకారులకు రూ.800 కోట్లు సబ్సిడీ రూపంలో అందించాం. ఈ ప్రభుతవపు హయాంలో మత్స్యకారులకు చేసింది ఏమీ లేదు. ఒక్క సబ్సిడీ కార్యక్రమం లేదు.
మత్స్యకారులను ఆదుకుంటాం
పైప్ లైన్ కారణంగా నష్టపోతున్న మత్స్యకారులను టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆదుకుంటాం. మత్స్యకారుల పిల్లల చదువుల కోసం 3 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసింది టిడిపి. టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే మరో 5 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బోట్ల కి ఇన్స్యూరెన్స్ అందిస్తాం. మత్స్యకారులను గుండెల్లో పెట్టుకొని కాపాడుకునే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను.
ట్రీట్ మెంట్ ప్లాంట్లు ఏర్పాటుచేస్తాం
ఈ ప్రభుత్వం ఆక్వా రంగాన్ని, హేచరిస్ ని చంపేసింది. పొల్యూషన్ లేని కంపెనీలు తీసుకొచ్చి స్థానికంగా యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కెమికల్, ఫార్మా కంపెనీల వ్యర్ధాలు సముద్రం లో కలవకుండా పొల్యూషన్ ట్రీట్మెంట్ ప్లాంట్ లు ఏర్పాటు చేస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో ఎలా అయితే బోట్లు, ఇంజిన్, వలలు, జీపీఎస్, ఐస్ బాక్సులు ఎలా అయితే ఇచ్చామో… తిరిగి సబ్సిడీ లో అందిస్తాం.
రూ.10ఇచ్చి వంద కొట్టేస్తుంది ఈ ప్రభుత్వం
కుడి చేత్తో 10 రూపాయిలు ఇచ్చి ఎడమ చేత్తో 100 రూపాయిలు కొట్టేస్తున్నారు . విధులు, నిధులు లేని కార్పొరేషన్లు పెట్టి బిసిలను మోసం చేసారు . బిసి మంత్రి పేషి లో పనిచేసే ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే దిక్కు లేదు. నేను ప్రస్తుత ప్రభుత్వం వారికి, మంత్రికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా.. ఎవరి హయాంలో మత్స్యకారులకు మేలు జరిగిందో చర్చకు నేను సిద్ధం. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి మత్స్యకారులను మోసం చేశారు . 45 ఏళ్లకే పెన్షన్, హౌసింగ్ లోన్ కింద 5 లక్షలు, కోల్డ్ స్టోరేజ్ లు ఏర్పాటు చేస్తానని చెప్పి మోసం చేసాడు.
టిడిపి హయాంలోనే మత్స్యకారులకు న్యాయం
మాజీ ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ… టిడిపి హయాంలోనే మత్స్యకారులు న్యాయం జరిగింది. చెరువుల్లో చేప పిల్లలు వదలడం దగ్గర నుండి చేపలు పట్టుకోవడానికి వలలు ఇవ్వడం వరకూ అన్నీ ఇచ్చి మత్స్యకారులను ఆదుకుంది N Chandrababu Naidu . టిడిపి హయాంలో బోట్లు, వలలు, జిపిఎస్, మోపిడ్, వ్యాన్లు, ఇతర సామగ్రి అంతా 90 శాతం సబ్సిడీ లో ఇచ్చాం. ఈ ప్రభుత్వం మత్స్యకారుల పొట్ట కొట్టింది. వేట విరామ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే సాయం ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత ఇవ్వడం లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత మత్స్యకారులు వేటలో చనిపోతే సాయం కూడా ఇవ్వడం లేదు. ఫార్మా, కెమికల్ కంపెనీల వ్యర్ధాలు సముద్రం లో కలవడం వలన మత్స్య సంపద తగ్గిపోతుంది. టిడిపి హయాంలో బోట్లు, వలలు, జిపిఎస్ ఇతర సామగ్రి సబ్సిడీలో అందించే వారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఎటువంటి సబ్సిడీ ఇవ్వడం లేదు.
మత్స్యకార ప్రతినిధులు మాట్లాడుతూ…
కాకినాడ సెజ్ లో ఉన్న కంపెనీల్లో 70 శాతం స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తాం అని ఇప్పటి ముఖ్య మంత్రి హామీ ఇచ్చి మోసం చేశాడు. పైప్ లైన్ కారణంగా బోట్లు, వలలు పోయి నష్టపోతున్నాం. ఈ ప్రభుత్వం ఎటువంటి నష్ట పరిహారం ఇవ్వడం లేదు. బొట్లకి ఇన్స్యూరెన్స్ లేకపోవడం తో మత్స్యకారులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. టిడిపి హయాంలో అమలైన ఇన్స్యూరెన్స్ స్కీం ని వీళ్ళు అమలు చెయ్యడం లేదు. డీజిల్ సబ్సిడీ పెంచాలి, పెద్ద బోట్లకి 8 వేల లీటర్ల డీజిల్ ఇవ్వాలి. మత్స్యకారుల కుటుంబాల్లో ఆడబిడ్డల పెళ్లిలకి సహాయం చెయ్యాలి. వేట విరామం సమయంలో అందించే సాయం అందించాలి. మత్స్యకారులకు, బోట్లుకి, వలలు కి ఇప్పట్టి ప్రభుత్వం లో ఇన్స్యూరెన్స్ అందడం లేదు. డీజిల్ రేటు పెరిగినా ఈ ప్రభుత్వం సబ్సిడీ పెంచడం లేదు. వలలు రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. సముద్రంలో చనిపోతే డాక్టర్ సర్టిఫికేట్ కావాలని వీళ్ళ ప్రభుత్వం అంటుంది.
లోకేష్ ను కలిసిన హేచరీస్ యజమానులు
పిఠాపురం నియోజకవర్గం కోనపాపపేటలో హేచరీస్ రైతులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కాకినాడ సెజ్ ప్రాంతంలో 500 రొయ్యల హేచరీలు ఉన్నాయి. దేశానికి అవసరమైన రొయ్యల సీడ్ లో 50శాతం ఇక్కడే ఉత్పత్తి చేస్తున్నాము. రూ.50వేల కోట్ల నికర విదేశీ మారక ఆదాయాన్ని కలిగిన రొయ్యల పరిశ్రమలో మేం భాగమై ఉన్నాము. మాకు నాణ్యమైన సముద్రపు నీరు, గాలి, భూగర్భ జలాలు అవసరం. రొయ్యల హేచరీల్లో ప్రత్యక్షంగా లక్షలాది మంది ఆక్వారైతులు, వేలాది ఉద్యోగులు ఆధారపడి జీవిస్తున్నారు. సెజ్ ప్రాంతంలో నిర్మించబోయే పరిశ్రమల నుండి హేచరీలను కాపాడాలి. రొయ్యల పరిశ్రమను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
జె-ట్యాక్స్ విధానాల కారణంగా ఆక్వారంగం సంక్షోభంలో కూరుకుపోయింది. సీడ్, ఫీడ్, మందుల ధరలు, కరెంటు ఛార్జీలు పెంచి ఆక్వా రైతులను అప్పుల్లో ముంచుతున్నారు. టీడీపీ పాలనలో ఆక్వా రంగంలో రాష్ట్రాన్ని భారతదేశంలోనే మొదటిస్థానంలో నిలిపాం. అధికారంలోకి వచ్చాక ఆక్వా రైతులు, హేచరీలను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. జోన్లతో సంబంధం లేకుండా ఆక్వా రైతులకు యూనిట్ కరెంటును రూ.1.50కు అందిస్తాం. మేం అధికారంలోకి వచ్చాక ఆక్వా రైతులను అన్నివిధాలా ఆదుకుంటాం. హేచరీస్ దెబ్బతినకుండా అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం. హేచరీలు ఉన్న ప్రాంతంలో నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకుంటాం.
నారా లోకేష్ ను కలిసిన శ్రీరాంపురం గ్రామస్తులు
పిఠాపురం నియోజకవర్గం శ్రీరాంపురం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కాకినాడ సెజ్ కోసం మా గ్రామ రైతుల నుండి భూమిని సేకరించారు. సెజ్ కు భూములిచ్చిన రైతుల్లో కొంతమందికి అన్యాయం జరిగింది. ఈ పనికిమాలిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మా గ్రామానికి ఒక్క పక్కాఇల్లు కూడా రాలేదు. భూమి తీసుకున్న రైతులకు జాబ్ కార్డులు ఇచ్చారు. కానీ నేటికీ ఈ జాబ్ కార్డులపై ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వలేదు. అరకొరగా వచ్చిన పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. సెజ్ కు భూములిచ్చిన రైతుల పిల్లలకు కాకుండా స్థానికేతరులకు ఉద్యోగాలిచ్చి అన్యాయం చేస్తున్నారు. మీరు అధికారంలోకి వచ్చాక మాకు న్యాయం చేయండి.
నారా లోకేష్ స్పందిస్తూ…
రాష్ట్రాభివృద్ధికి ఉపకరించే ప్రధాన ప్రాజెక్టులకు భూములను త్యాగం చేసిన రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. టిడిపి అధికారంలోకి వచ్చాక కాకినాడ సెజ్ ప్రాంతంలో పరిశ్రమలు రప్పించేందుకు చర్యలు తీసుకుంటాం. జాబ్ కార్డులు పొందిన వారికి ఉద్యోగాలు ఇప్పించేలా చర్యలు తీసుకుంటాం. ఇళ్లులేని ప్రతిఒక్కరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తాం.
Also, read this blog: Nara Lokesh’s Yuvagalam Padayatra – A walk of purpose, A stride of progress
Tagged: #LokeshPadaYatra #Padayatra #YuvaGalamLokesh #YuvaGalam #NaraLokeshPadaYatra #NaraLokesh