Latest News:

దళిత జాతికే కళంకం సునీల్‌ కుమార్‌ పులివెందుల వేషాలు కుప్పంలో చెల్లవు అఫిడవిట్‌లో చెప్పినవన్నీ నిజాలే : వైఎస్‌ షర్మిల
Nara Lokesh Yuvagalam

కాకినాడలో హోరెత్తించిన యువగళం పాదయాత్ర అడుగడుగునా యువనేతకు బ్రహ్మరథం పట్టిన జనం  నేడు పిఠాపురం బహిరంగసభలో లోకేష్ ప్రసంగం

కాకినాడ: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర కాకినాడ నగరంలో దుమ్మురేపింది. యువగళం రాకతో కాకినాడ నగరం జనజాతరను తలపించింది. చొల్లంగిపేట నుంచి ప్రారంభమైన 214వరోజు (శుక్రవారం) యువగళం పాదయాత్రకు కాకినాడ సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో ప్రజలనుంచి అనూహ్య స్పందన లభించింది. కాకినాడ సినిమారోడ్డులో లోకేష్ పాదయాత్రకు కనివినీ ఎరుగని రీతిలో స్పందన లభించింది. యువనేత లోకేష్ కు స్వాగతం పలుకుతూ నగర వీధుల్లో అడుగడుగునా జనసేన – టిడిపి ఫ్లెక్సీలు వెలిశాయి. యువగళం జెండాలు చేతబూని టిడిపి-జనసేన కార్యకర్తల ఘనస్వాగతం పలికారు. యువనేతను చూసేందుకు జనం భారీగా రోడ్లపైకి తరలివచ్చారు. మహిళలు హారతులతో నీరాజనాలు పట్టారు.  జై టీడీపీ జై జై టీడీపీ నినాదాలతో నగర వీధులు హోరెత్తాయి. కాకినాడ ఆనంద భారతి గ్రౌండ్ వద్ద క్రైస్తవ మతపెద్దలు యువనేతకు ఆశీర్వచనాలు అందించారు. నగరంలో వివిధ వర్గాల ప్రజలు యువనేతను కలుసుకొని తాము ఎదుర్కొంటున్న సమస్యలను చెప్పుకున్నారు. మత్స్యకారులు, లారీఓనర్స్ అసోసియేన్ ప్రతినిధులు, న్యాయవాదులు, దళితులు, డ్వాక్రా మహిళలు, దివ్యాంగులు యువనేతను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. కాకినాడ చొల్లంగిపేట నుంచి ప్రారంభమైన పాదయాత్ర గురజనాపల్లి, ఎంఎస్ ఎన్ చారిటీ, ఘాటీ సెంటర్, సినిమారోడ్డు, కల్పన సెంటర్, ఆనందభారతి గ్రౌండ్స్, వైఎస్సార్ బ్రిడ్జి, కోకిల సెంటర్, ఆర్ఎంసి గ్రౌండ్స్, నాగమల్లితోట, సర్పవరం జంక్షన్ మీదుగా తిమ్మాపురంలోని యార్లగడ్డ గార్డెన్స్ విడిది కేంద్రానికి చేరుకుంది. 214వరోజు యువనేత లోకేష్ 18.2 కి.మీ.ల పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 2944.6 కి.మీ. మేర పూర్తయింది. యువగళం పాదయాత్రలో భాగంగా శనివారం మధ్యాహ్నం పిఠాపురంలో జరిగే బహిరంగసభలో లోకేష్ ప్రసంగిస్తారు.

నాగార్జునసాగర్ వద్ద డ్రామా కోడికత్తిలాంటిదే! తెలంగాణా పోలింగ్ రోజే రైతులు గుర్తొచ్చారా? ఖేలో ఇండియా పేరుమార్చి ఆడుదాం ఆంధ్రపేరుతో బిల్డప్కు భయం పట్టుకుంది…అందుకే పరదాల యాత్ర. చంద్రబాబుకు అవినీతి మరక అంటించాలని చూశారు, కాకినాడ ఎమ్మెల్యే దోచిందంతా కక్కిస్తాం,టిడిపి కేడర్ ను వేధించిన వారిని ఎక్కడున్నా వదలను, కాకినాడ బహిరంగసభలో యువనేత నారా లోకేష్

కాకినాడ: క‌ర‌వుతో రైతులు అల్లాడుతుంటే క‌నీసం స‌మీక్ష కూడా చేయ‌ని ఈ ప్రభుత్వంకి తెలంగాణ పోలింగ్ రోజు రైతులు గుర్తొచ్చారు, సాగ‌ర్ ఆయ‌క‌ట్టు రైతుల‌పై ప్రేమ పొంగి పొర్లింది, పోలీసుల్ని పంపి నాగార్జున సాగ‌ర్ పై శాంతిభ‌ద్రత‌ల స‌మ‌స్య క్రియేట్ చేయించాడు. ఇదీ మరో డ్రామా లాంటిదేనని యువనేత నారా లోకేష్ దుయ్యబట్టారు. కాకినాడ రూరల్ సర్పవరంలో ఏర్పాటుచేసిన భారీ బహిరంగసభలో యువనేత లోకేష్ మాట్లాడుతూ… ఈ ప్రభుత్వానికి భయం పట్టుకుంది. వీరికి  చంద్రబాబుని చూస్తే భయం, పవన్ కళ్యాణ్ ని చూస్తే భయం, లోకేష్ ని చూస్తే భయం. N Chandrababu Naidu  భవిష్యత్తు కి గ్యారెంటీ కార్యక్రమం చేస్తే ఏ పరభుత్వానికి భయం, పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేస్తే భయం, లోకేష్ యువగళం పాదయాత్ర చేస్తే భయం. సొంత అమ్మని చూసినా భయమే.. సొంత చెల్లిని చూసినా భయమే.  ఆఖరికి ప్రజల్ని చూసినా భయమే అందుకే పరదాలు కట్టుకొని దొంగలా వెళ్తాడు. తెలుగుదేశం ఘన చరిత్ర ఉన్న పార్టీ, పాలనాలో వున్నా ఈ పార్టీ  గజదొంగలపార్టీ.

కేకపుట్టించిన కాకినాడ

కాకినాడ కేక పుట్టించింది. కాకినాడ రూరల్, టౌన్ నియోజకవర్గాల ప్రజలు, టిడిపి – జనసేన నాయకులు, కార్యకర్తలకు నా అభినందనలు. కాకినాడ కాజా ఎంత స్వీట్ గా ఉంటుందో ఇక్కడ ప్రజలు అంత స్వీట్ గా ఉంటారు. శ్రీ భావనారాయణ స్వామి ఆలయం, జామియా మస్జీద్, చర్చ్ స్క్వేర్ ఉన్న పుణ్య భూమి కాకినాడ.  గొప్ప చరిత్ర ఉన్న కాకినాడలో పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం. TDP  కార్యకర్తలు, నాయకుల్ని ఇబ్బంది పెట్టిన వారు కాకినాడ లో ఉన్నా కంబోడియా పారిపోయినా పట్టుకొచ్చి లోపలేస్తా. చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులకు కూడా శిక్ష తప్పదు.

ఓటమి భయంతోనే చంద్రబాబు అరెస్టు

వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే చంద్రబాబుని అరెస్ట్ చేసాడు. న్యాయానికి సంకెళ్లు వేసాడు..చంద్రబాబు గారిని 53 రోజులు బంధించాడు. చంద్రబాబు చేసిన తప్పేంటి? ప్రజల తరపున పోరాడటం తప్పా? ఈ ప్రభుత్వం చేసే తప్పులను ప్రశ్నించడం తప్పా? కుటుంబం కంటే ప్రజలే ఎక్కువ అనుకోని రాష్ట్రం కోసం కష్టపడటం తప్పా? చంద్రబాబుకి అవినీతి మరక అంటించాలని ప్రయత్నించాడు.  ముందు 3 వేల కోట్ల అవినీతి  అన్నారు, తర్వాత 370 కోట్లు అవినీతి అన్నారు, ఇప్పుడు 27 కోట్లు అంటున్నారు. అది కూడా పార్టీ అకౌంట్ కి డబ్బులు వచ్చాయి అంటున్నారు.  ఆ 27 కోట్లు ఏంటో తెలుసా.. మన పసుపు సైన్యం సభ్యత్వం తీసుకోని కట్టిన రుసుము. ఆరోపణలు తప్ప ఆధారాలు లేవని బెయిల్ ఇస్తూ హైకోర్టు తేల్చేసింది.

మా గొంతు నొక్కేవాడు ఇంకా పుట్టలేదు!

నాది అంబేద్కర్ రాజ్యాంగం. నాది తాత ఇచ్చిన గొంతు. స్వర్గీయ N.T.Rama rao  గారు ఇచ్చిన గొంతు నొక్కే వాడు ఇంకా ఈ భూమి మీద పుట్టలేదు. ఏమి పీకలేక ఈ పాలన లొ వున్న ప్రభుత్వం చంద్రబాబుని అరెస్ట్ చేసి నన్ను ఆపాడు.  అయినా యువగళం ఆగదు .. తాడేపల్లి ప్యాలస్ గోడలు బద్దలు కొడతాం.  సాగనిస్తే పాదయాత్ర…అడ్డుకుంటే పాలన లొ వున్న ప్రభుత్వంకి శవయాత్ర. 

ఇసుకలో బొక్కింది రూ.5400 కోట్లు!

రోజూ పందికొక్కులా ఇసుక తింటున్నారు.  టిడిపి హయాంలో ట్రాక్టర్ ఇసుక రూ. 1500, వీరి హయాంలో ట్రాక్టర్ ఇసుక రూ.5000. రోజుకి ఇసుక దోపిడీ లో పాలన్ లొ వున్న ప్రభుత్వం వాటా ఎంతో తెలుసా రూ. 3 కోట్లు, నెలకి రూ.90 కోట్లు, సంవత్సరానికి రూ.1080. ఐదేళ్లలో భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టి సంపాదించిన ఇసుక ఆదాయం ఎంతో తెలుసా రూ.5,400 కోట్లు. సాగునీరు లేక రైతులు రోడ్డెక్కి ఆందోళ‌న చేస్తున్నారు. వీరి ఇసుక దాహానికి ఏకంగా అన్న‌మ‌య్య ప్రాజెక్టే కొట్టుకుపోయింది. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయాయి.

మహిళల డబ్బు కొట్టేస్యారు 

ప్రస్తుతం పాలన లో వున్న ప్రభుత్వం మహిళల్ని నమ్మించి మోసం చేసారు. సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు ఏం మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తా అని మోసం చేసాడు.  2వేల కి.మీ.ల పాదయాత్రలో మీ కష్టాలు చూసాను…కన్నీళ్లు తుడుస్తాను . భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించాం. మహాశక్తి పథకం కింద… 

1)ఆడబిడ్డ నిధి:- 18 ఏళ్లు నిండిన మహిళలకు – నెలకు రూ.1500 అంటే ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు.

2) తల్లికి వందనం:- ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు. ఇద్దరు ఉంటే రూ.30 వేలు. 

3) దీపం పథకం:- ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం 

4) ఉచిత ప్రయాణం:- మహిళలకు ఉచిత ప్రయాణం.

యువగళం నిధితో ఆదుకుంటాం

పాలన లొ వున్న ప్రభుత్వం  యువత భవిష్యత్తు పై దెబ్బకొట్టింది . యువత ఎప్పుడూ పేదరికంలో ఉండాలి అని కోరుకుంటున్నారు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసారు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్ పధకం రద్దు చేసాడు.  యువగళాన్ని విన్నాం. ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి ద్వారా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. నిరుద్యోగ యువతకు యువగళం నిధి కింద నెలకు రూ.3000 ఇస్తాం.

ప్రతిఏటా జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం

టిడిపి – జనసేన  అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం. పెండింగ్ పోస్టులు అన్ని భర్తీ చేస్తాం. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం. ఒక్క ఛాన్స్ అడిగిన ఇ ప్రభుత్వం రైతులు లేని రాజ్యం తెస్తున్నారు. వీరి పరిపాలనలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో రైతులు నష్టపోతున్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ నంబర్ 3, కౌలు రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 2. రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మోటార్లకు మీటర్లు పెడుతున్నాడు. ఆ మీటర్లు రైతులకు ఉరితాళ్లు. మీటర్లు బిగిస్తే పగలగొట్టండి. టిడిపి మీకు అండగా ఉంటుంది. రైతుల బాధలు చూసాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాతకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం.

ఉద్యోగులు, పోలీసులకూ ఎగనామం

ఉద్యోగస్తులను వేధిస్తున్నారు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని  200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. ఇప్పుడు జిపిఎస్ అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టారు. పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టారు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు. పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడు. నేను ప్రతి రోజూ మాట్లాడుతుంటే భయపడి కొంత బకాయి తీర్చాడు. ఇంకా రావాల్సింది చాలా ఉంది.ఆఖరికి పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వలేని దివాలాకోరు ప్రభుత్వం ఇది. ఇప్పుడు ఏకంగా పోలీసులకు ఇచ్చే అలవెన్స్ కూడా కోతపెట్టారు. 15 శాతం అలవెన్స్ కట్ చేసారు. ఎస్ఐ కి 10 వేలు, హెడ్ కానిస్టేబుల్ కి 8 వేలు, కానిస్టేబుల్ కి 6 వేలు కట్ చేసారు. వీళ్ళు  తెచ్చిన జిఓ 79 రద్దు చేస్తాం. అలవెన్స్ యధాతధంగా ఇస్తాం.

బిసిల రక్షణకు ప్రత్యేక చట్టం

బీసీలు పడుతున్న కష్టాలు నేను నేరుగా చూసాను. అమర్నాధ్ గౌడ్ ని పెట్రోల్ పోసి చంపేసారు. సైకోపాలనలో 26 వేల బిసిలపై అక్రమ కేసులు, నిధులు, కుర్చీలు లేని కార్పొరేషన్లు.  టిడిపి – జనసేన  అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపకులాల వారీగా నిధులు, బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం.  అబ్దుల్ సలాం, కరీముల్లా, ఇబ్రహీం, మిస్బా, హజీరా. ఇలా ఎంతో మంది బాధితులు.  మైనార్టీలకు ఉన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. దుల్హన్, విదేశీ విద్య, రంజాన్ తోఫా, ఇమామ్, మౌజమ్ లకు గౌరవ వేతనం, మసీదుల అభివృద్ధి కి నిధులు కూడా ఇవ్వడం లేదు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం.

దళితులు వేధించేవారిపై కఠిన చర్యలు

డాక్టర్ సుధాకర్ దగ్గర నుండి కొవ్వూరు లో మహేంద్ర వరకూ ఇ ప్రస్తుత ప్రభత్వం పాలనలో దళితుల్ని ఎలా చంపారో చూసారు. 27 దళిత సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసారు . టిడిపి – జనసేన  అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులను వేధించిన వారిని కఠినంగా శిక్షిస్తాం.రద్దు చేసిన 27 దళిత సంక్షేమ కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తాం. 

రూరల్ లో అవినీతి ఫుల్!

కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని ప్రస్తుత MLAని  ప్రజలు గెలిపించారు. అదృష్టం బాగుండి ఆయన మంత్రి కూడా అయ్యారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం ఏమైనా అభివృద్ధి చెందిందా? మీ జీవితాలు ఏమైనా మారాయా? కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి నిల్లు..అవినీతి ఫుల్లు.  అవినీతి లో వారి పాలకుడిని మించిపోయేసరికి ఇతని మంత్రి పదవి పోయింది. నియోజకవర్గాన్ని కేకులా కోసి కుటుంబ సభ్యులకు పంచేసారు. నియోజకవర్గంలో కాంట్రాక్టులన్ని MLA  తండ్రి, తమ్ముడే చేస్తున్నారు.

ఎత్తిపోతల పథకాలు పూర్తిచేస్తాం

టిడిపి హయాంలో వేములవాడలో రెండు, పెద్దాపురం పాడులో ఒకటి ఎత్తిపోతల పథకాలకు నిధులు కేటాయించి పనులు ప్రారంభించాం. ఈ  ప్రభుత్వం ఆ పనులు ఆపేసింది. టిడిపి – జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ ప్రాజెక్టులు పూర్తి చేసి సాగునీరు అందిస్తాం. టిడిపి హయాంలో కొంగోడు గ్రామంలో ఎత్తిపోతల పథకం, కాలువ పై బ్రిడ్జ్ నిర్మాణానికి నిధులు కేటాయించి పనులు ప్రారంభిస్తే ఈ ఒక్క ఛాన్స్ ప్రభుత్వం ఆపేసింది. టిడిపి – జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ ప్రాజెక్టులు పూర్తి చేసి సాగునీరు అందిస్తాం. రూరల్ లో ఆరు గ్రామాలకు ఎన్నికలు నిర్వహించడం లేదు. ప్రత్యేకాధికారుల పాలనలో కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. టిడిపి – జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే  ఆ గ్రామాలను అభివృద్ధి చేస్తాం. సమస్యను పరిష్కరిస్తాం.

కాకినాడ రూరల్ ను అభివృద్ధి చేస్తాం!

టిడిపి హయాంలో 50 కోట్లతో ఎన్టీఆర్ బీచ్ అభివృద్ధి చేసాం. ఇప్పుడు దానిని మూసేసింది ఈ సిగ్గుమాలిన ప్రభుత్వం. మేము తిరిగి దానిని ప్రారంభిస్తాం. కాలువలు ఆధునీకరణ లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. టిడిపి – జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే కాలువలు ఆదునీకరిస్తాం.  ప్రభుత్వ గర్ల్స్ కాలేజ్ లో కనీస మౌలిక వసతులు లేవు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మౌలిక వసతులు కల్పిస్తాం. కాకినాడ రూరల్ లో ఉన్న తాగునీటి సమస్య పరిష్కారం కోసం ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత తాగునీరు అందిస్తాం. కాకినాడ రూరల్ లో రోడ్లు ఘోరంగా ఉన్నాయి. కొత్త రోడ్లు వేస్తాం.

ఏ పాలనా లొ వున్న ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?

కాకినాడ సిటీ కి అనేక హామీలు ఇచ్చారు. టిడ్కో ఇళ్లు ఉచితంగా ఇస్తామని అన్నారు. 10 వేల ఇళ్లు కట్టిస్తా అన్నారు. పోర్టు కార్మికులకు పర్మినెంట్ ఉద్యోగాలు ఇస్తానని అన్నారు. సిటీ కి దూరంగా డంపింగ్ యార్డ్ ఏర్పాటు అన్నారు. ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్టుకోలేదు. టిడిపి – జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే పేదలకు ఇళ్లు కట్టిస్తాం.  భూకబ్జాలకు గురైన స్థలాలు అసలైన యజమానులకు ఇస్తాం.  భూకబ్జాలు, సెటిల్మెంట్స్, పేకాట క్లబ్బులు, డ్రగ్స్ నుండి యువతను కాపాడతాం.

యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం

మళ్లీ కాకినాడ అభివృద్ధి చెందాలి అంటే టిడిపి – జనసేన ప్రభుత్వం రావాలి. యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం.  మత్స్యకారులకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ఎమ్మెల్యేలుగా ఉన్న పిల్లి అన్నంత లక్ష్మి, కొండబాబు కాకినాడ ను అభివృద్ధి చేసారు. పేదలకు ఇళ్లు, తాగు, సాగునీటి ప్రాజెక్టులు, సిసి రోడ్లు, అంగన్వాడీ భవనాలు, కమ్యూనిటీ భవనాలు ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టారు. 

నారా లోకేష్ ను కలిసిన కాకినాడ మత్స్యకారులు

కాకినాడ బాలయోగి విగ్రహం వద్ద మత్స్యకారులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. వేటకు వెళ్లే మత్స్యకారులకు కూలీ గిట్టుబాటు కావడం లేదు. డీజిల్ పై సబ్సిడీ పెంచి ఆదుకోవాలి. మత్స్యకారులకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు పూర్తిగా అందడం లేదు. మత్స్యకార ప్రాంతాలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. మత్స్యకారుల వ్యాపారాలకు అనువైన మార్కెట్ షెడ్లు లేవు. యువతకు ఉపాధి అవకాశాలు లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్నారు. వేటకు వెళ్లి గల్లంతైన వారి కుటుంబాలకు పరిహారం పెంచాలి. దూర ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో చదివే విద్యార్థులకు రెండు పూటలా బస్సు సౌకర్యం కల్పించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ…

కాకినాడలో అత్యధిక జనాభా కలిగిన మత్స్యకారుల సంక్షేమాన్ని ఈ ప్రభుత్వం గాలికొదిలేసింది. కుర్చీలేని కార్పొరేషన్ ఏర్పాటుచేసి ఎటువంటి నిధులు కేటాయించకుండా తీవ్రంగా దగాచేసింది. గత టిడిపి ప్రభుత్వ హయాంలో ఆదరణ పథకం కింద మత్స్యకారులకు సబ్సిడీపై బోట్లు, వలలు, ఇతర పనిముట్లు అందజేశాం. టిడిపి అధికారంలోకి వచ్చాక మత్స్య సంపదను అమ్ముకునేందుకు అనువైన షెడ్లు ఏర్పాటు చేస్తాం. కాకినాడలో మత్స్యకారుల పిల్లల కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ కళాశాల ఏర్పాటుచేస్తాం. మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగుపర్చి స్థానిక మత్స్యకార యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం.

లోకేష్ ను కలిసిన లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు

కాకినాడ ఘాటీ సెంటర్ లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లారీ అసోసియేషన్ ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రవాణా అధికారులు గ్రీన్ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ రూపాల్లో రవాణావాహనాలను దోచేస్తున్నారు. రైత్వారీ లోడ్ లకు కూడా ఏదో ఒక కారణం చూపి రూ.30వేలు జరిమానా విధిస్తున్నారు. డీజిల్ ధరలు పెరుగుదల, కిరాయి ధరలు తక్కువ అవ్వడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నాం. కాకినాడ ఎమ్మెల్యే టీడీపీకి చెందిన లారీ ఓనర్లను సంఘం సభ్యత్వం తీసేసి వేధిస్తున్నాడు. మీరు అధికారంలోకి వచ్చాక లారీ ఓనర్లను ఆదుకోవాలి.

నారా లోకేష్ స్పందిస్తూ…

ఈ ప్రభుత్వం దోపిడీ పాలన కారణంగా రవాణారంగం సంక్షోభంలో కూరుకుపోయింది. ఇదివరకెన్నడూ లేనివిధంగా అడ్డగోలుగా ట్యాక్సులు పెంచడంతో ఓనర్లు డ్రైవర్లుగా మారిపోయారు. టిడిపి అధికారంలోకి వచ్చాక ఈ  ప్రభుత్వంలో పెంచిన పన్నులను సమీక్షించి లారీఓనర్లకు ఉపశమనం కలిగిస్తాం. లారీఓనర్స్ యూనియన్ లో రాజకీయ జోక్యానికి చెక్ పెడతాం, యూనియన్లలో తలదూర్చి ఇబ్బందులకు గురిచేసే దోపిడీ దొంగలకు షాక్ ట్రీట్ మెంట్ ఇస్తాం. వ్యవసాయ ఉత్పత్తుల రవాణా వాహనాలపై ఆంక్షలను తొలగిస్తాం.

లోకేష్ ను కలిసిన మినీవ్యాన్ ఓనర్స్ యూనియన్ ప్రతినిధులు

కాకినాడ సినిమారోడ్డులో మినీ వ్యాన్ ఓనర్స్ యూనియన్ ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ ప్రభుత్వం  అధికారంలోకి వచ్చిన నాటినుండి మేం నష్టాల ఊబిలో కూరుకుపోయాం. రోడ్లు పాడైపోయి వాహనాలు దెబ్బతిని తరచూ రిపేర్లు వస్తున్నాయి. గత నాలుగేళ్లుగా మినీవ్యాన్లపై ట్యాక్సులు అడ్డగోలుగా పెంచి దోచేస్తున్నారు. గతంలో రూ.3వేలు ఉండే ట్యాక్స్ ను రూ.3,600కు పెంచారు. గ్రీన్ ట్యాక్స్ టీడీపీ పాలనలో రూ.200 ఉండేది.ఈ  సర్కార్ రూ.6వేలకు పెంచారు. ఓవర్ లోడ్ ట్యాక్స్ టన్నుకు గతంలో రూ.2వేలు ఉండేది..నేడు రూ.20వేలకు పెంచారు. మీరు అధికారంలోకి వచ్చాక ట్యాక్సులు తగ్గించి మినీ వ్యాన్ ఓనర్లను ఆదుకోవాలి.

నారా లోకేష్ స్పందిస్తూ…

ఈ ప్రభుత్వం ప్రజల రక్తంతాగే జలగలా తయారై పన్నుమీద పన్నులతో మోయలేని భారం మోపుతుంది.ఈ సీఎం అయ్యాక రవాణా రంగాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీశాడు. డీజిల్ ధరలు, ట్యాక్సులు ఇష్టారాజ్యంగా పెంచి వేధిస్తున్నాడు. రోడ్లన్నింటినీ గుంతలమయంగా మారినా నాలుగున్నరేళ్లుగా తట్టెడు మట్టికూడా పోయడం లేదు. మేం అధికారంలోకి వచ్చాక గ్రీన్ ట్యాక్స్, ఓవర్ లోడ్ ట్యాక్స్ తగ్గిస్తాం. పాడైపోయిన రోడ్ల స్థానంలో కొత్త రోడ్లు నిర్మిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన అగ్రిగోల్డ్ బాధితులు

కాకినాడ కామాక్షిదేవి గుడివద్ద అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. 8 రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్ సమస్యలతో బాధితులు ఆత్మహత్యలు చేసుకుంటున్న సమయంలో చంద్రబాబు భరోసా ఇచ్చారు. బాధితుల వివరాలను సేకరించి, రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కమిటీ వేసి అగ్రిగోల్డ్ వేలం ప్రక్రియను ప్రారంభించారు. ఈ ప్రభుత్వం ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన వారంలో రూ.1,183కోట్లతో రూ.20వేలు లోపు ఉన్న 14లక్షల డిపాజిటర్లకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి, 10వేల రూపాయల లోపు డిపాజిట్లకు మాత్రమే అరకొరగా ఇచ్చారు. మీరు అధికారంలోకి వచ్చాక మాకు న్యాయం చేయండి.

నారా లోకేష్ స్పందిస్తూ…

మాటతప్పడం, మడపతిప్పడం ఈ ప్రభుతావనికి వెన్నతో పెట్టిన విద్య. అగ్రిగోల్డ్ బాధితులకు ఇప్పటికీ న్యాయం జరగకపోవడం దురదృష్టకరం. టిడిపి అధికారంలోకి వచ్చాక చట్టపరిధిలో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయంచేస్తాం.

లోకేష్ ను కలిసిన దళిత సత్తా సంఘం ప్రతినిధులు

కాకినాడ వైఎస్సార్ బ్రిడ్జి వద్ద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా దళిత సత్తా ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎస్సీ, ఎస్టీలకు టీడీపీ హయాంలో ఇచ్చిన సంక్షేమ పథకాలను ఈ ప్రభుత్వం  తుంగలో తొక్కింది. ఇంతకు ముందు ప్రభత్వం రద్దు చేసిన ఎన్.ఎస్.ఎఫ్.డీ.సీ, ఎన్.ఎస్.కె.ఎఫ్.డీ.సీ పథకాలను చంద్రబాబు పునరుద్ధరించారు.మరళ ఈ ప్రభుత్వం  అధికారంలోకి వచ్చాక ఈ పథకాలను కూడా రద్దు చేసింది . ఈ ప్రభుత్వం పాలనలో దళితులపై దమనకాండ, హత్యలు, దురాగతాలు పెరిగిపోయాయి. దళితులకు వీరి పాలనలో అడుగడుగునా అన్యాయమే జరుగుతోంది. మీరు అధికారంలోకి వచ్చాక ఎస్సీ కార్పొరేషన్ కు నిధులిచ్చి ఆదుకోవాలి. 

నారా లోకేష్ స్పందిస్తూ…

దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం … దళితులను ఊచకోత దమనకాండ సాగిస్తున్నారు. దళితులను చంపి డోర్ డెలివరీ చేసే నేతలను వెంటేసుకుని తిరుగుతున్నారు. దళితులకు సంబంధించిన 27సంక్షేమ పథకాలు రద్దు చేసి ద్రోహం చేశారు. దళితుల సంక్షేమానికి ఖర్చుచేయాల్సిన రూ.28,147 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించిన దళిత ద్రోహి వీళ్లు. టిడిపి-జనసేన అధికారంలోకి వచ్చాక ఎస్సీ కార్పొరేషన్ ను బలోపేతం చేస్తాం. వీళ్లు రద్దు చేసిన సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తాం. ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీచేస్తాం.

లోకేష్ ను కలిసిన దివ్యాంగుల జేఏసీ ప్రతినిధులు

కాకినాడ కోకిల సెంటర్ లో ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లా దివ్యాంగుల జేఏసీ ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. దివ్యాంగుల హక్కుల చట్టం 2016ను పూర్తిస్థాయిలో అమలు చేయాలి, ఇందుకోసం కమిషన్ ను నియమించాలి. పేదరిక నిర్మూలన పథకాల్లో 10శాతం మాకు రిజర్వేషన్ కేటాయించాలి. దివ్యాంగులకు సబ్ ప్లాన్ ను అమలు చేయాలి. ఏ విధమైన అడ్డంకులు లేకుండా 3ఏళ్లు పైబడిన దివ్యాంగులకు పదోన్నతులు ఇవ్వాలి. దివ్యాంగుల పెన్షన్ ను రూ.6వేలకు పెంచాలి. దివ్యాంగుల వసతిగృహాల్లో మెస్ చార్జీలు పెంచాలి. చంద్రన్న పెళ్లికానుకను తక్షణం అమలు చేయాలి. దివ్యాంగులకు విదేశాల్లో చదువుకునే అవకాశం కల్పించాలి. మండల స్థాయిలో మానసిక వైకల్యంగలవారికి వైద్యుడిని నియమించాలి. దివ్యాంగులకు ప్రైవేట్ కంపెనీల్లో కూడా ఉద్యోగావకాశాలు కల్పించాలి. పంచాయతీ నుండి ఎంపీ స్థాయి వరకు దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ అమలు చేయాలి. దివ్యాంగులపై జరుగుతున్న దాడులు అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి.

నారా లోకేష్ స్పందిస్తూ…

ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ ను నిర్వీర్యం చేశాడు. దివ్యాంగులపై కనీసం మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు.  గత నాలుగున్నరేళ్లలో ఒక్కరికి కూడా మూడు చక్రాల మోటార్ సైకిల్, పనిముట్లు ఇవ్వలేదు. స్వయం ఉపాధికి సంబంధించిన సబ్సిడీ లోన్లు మంజూరు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక దివ్యాంగుల హక్కుల చట్టం అమలుకు చర్యలు తీసుకుంటాం. దివ్యాంగులకు విదేశీవిద్య, చంద్రన్న పెళ్లికానుక అమలుచేస్తాం. దివ్యాంగులపై దాడులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.

యువనేతను కలిసిన కాకినాడ న్యాయవాదులు

కాకినాడ సంతచెరువు సెంటర్ లో కాకినాడ న్యాయవాదులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఇటీవల ఈ పాలనలో వున్న  ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్ట వ్యతిరేకమైనది. ఈ చట్టం వల్ల ప్రజల ప్రైవేటు ఆస్తులకు రక్షణ కరువవుతుంది. ఈ చట్టం న్యాయవిరుద్దమైనది, చట్టం ముసుగులో ప్రభుత్వం మరో భూదందాకు తెరలేపింది. మీరు అధికారంలోకి వచ్చాక ఈ చట్టాన్ని రద్దు చేయాల్సింది కోరుతున్నాము. జూనియర్ న్యాయవాదులు దయనీయ స్థితిలో ఉన్నారు. ఈ ప్రభుత్వం లా నేస్తం కింద నెలకు రూ.5వేలరూపాయలు ఇస్తామని చెప్పి, ఆరునెలలకు ఒకసారి మాత్రమే అరకొరగా నిధులు విడుదల చేస్తోంది. లా నేస్తం మొత్తాన్ని రూ.8వేలకు పెంచి, అర్హులైన ప్రతి ఒక్కరికీ అమలుచేయాలి. జూనియర్ న్యాయవాదులకు జీవిత బీమా కల్పించి ఆదుకోవాలి.

నారా లోకేష్ స్పందిస్తూ..

రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అడ్డగోలు చట్టాలతో భూదోపిడీని వ్యవస్థీకృతం చేయాలని చూస్తోంది. ప్రజల ఆస్తులను కొట్టేసేందుకే ప్రభుత్వం ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెచ్చింది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే చట్టవిరుద్ధమైన ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దుచేస్తాం. జూనియర్ న్యాయవాదులకు క్రమం తప్పకుండా భృతితోపాటు జీవితబీమా సౌకర్యం కల్పిస్తాం.

Also, read this blog:  Beyond Boundaries: Nara Lokesh and the Youth Movement

Tagged: #LokeshPadaYatra #Padayatra #YuvaGalamLokesh #YuvaGalam #NaraLokeshPadaYatra #NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *